Share News

Life Lesson: కెరీర్ లో విజయం సాధించాలంటే.. ఈ 5 విషయాలు గుర్తుంచుకోవాలి..!

ABN , Publish Date - Oct 26 , 2024 | 04:38 PM

కెరీర్ లో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజేతలు కొందరే అవుతారు. ఈ విషయాలు గుర్తుంచుకుంటే కెరీర్ లో విజయం సాధించడం సులువు.

Life Lesson: కెరీర్ లో విజయం సాధించాలంటే.. ఈ 5 విషయాలు గుర్తుంచుకోవాలి..!

ప్రతి వ్యక్తి జీవితంలో కెరీర్ ప్రధానపాత్ర పోషిస్తుంది. ఎంచుకున్న వృత్తి, వ్యాపారం, చదువు మొదలైనవి వ్యక్తి జీవితం ఎలా ఉంటుదనే విషయాన్ని నిర్థేశిస్తాయి. కేరీర్ లో సక్సెస్ అయిన వారి జీవితం చాలా వరకు వారు ఆశించినట్టు ఉంటుంది. అయితే ఇందులో సక్సెస్ సాధించడం అంత సులువుగా ఏమీ జరగదు. జీవితంలో ఎన్నో సవాళ్లు, మరెన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొందరు ఆలోచనతోనూ, అవగాహనతోనూ, ముందు జాగ్రత్తలతో కెరీర్ లో విజయాన్ని సులభంగా అందుకుంటారు. మరికొందరు అవగాహనా లోపంతో కష్టపడతారు. అయిదు విషయాలను దృష్టిలో పెట్టుకుంటే కెరీర్ లో విజయం సాధించడం సులువు అని కెరీర్ గైడెన్స్ నిపుణులు అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే..

Diabetes: పండుగల సమయంలో షుగర్ పెరకకూడదంటే డయాబెటిస్ ఉన్నవారు ఇలా చేయాలి..


గోల్స్..

కెరీర్ లో విజయం సాధించాలి, జీవితం సంతోషంగా ఉండాలి అని అందరూ అనుకుంటారు. కానీ దానికి తగిన మార్గాలు ఎంచుకునే విషయంలో వారు అవగాహనా లోపంతో ఉంటారు. అంతేకాదు.. విజయం సాధించాలనే ఆరాటం, ఊరికే కష్టపడిపోవడం తప్ప కొందరికి లక్ష్యం అంటూ ఉండదు. జీవితంలో విజయం సాధించాలంటే మొదట గోల్స్ సెట్ చేసుకోవాలి. లక్ష్యాలను ఏర్పరుచుకుని వాటి కోసం కష్టపడి వాటిని సాధించుకుంటే అప్పుడు విజయం సాధ్యమవుతుంది. పైగా స్పష్టత లేని విషయాల కోసం కష్టపడితే సమయం, శ్రమ వృథా అవుతుంది.

నేర్చుకోవాలి..

చాలామంది తప్పులు చేసిన తరువాత వాటిని సమర్థించుకుంటారు. తమకు తప్పు చేసే అలవాటు లేదని బుకాయిస్తారు. మరికొందరు ఎక్కడైనా తప్పు జరిగితే ఇక అది తమ వల్ల కాదని దాన్ని అక్కడే వదిలి మరొక పని పట్టుకుంటారు. కానీ తప్పులు జరిగినప్పుడు దాన్నుండి అనుభవ పాఠం నేర్చుకోవాలి. మరోసారి అలా తప్పు జరగకుండా చూసుకోవాలి. ఇలా చేస్తే ఇంకోసారి తప్పు లేకుండా పనులు పూర్తీ చేయగలుగుతారు.

సమయం..

టైం మేనేజ్మెంట్ ఒక వ్యక్తి జీవితాన్ని చాలా మార్చేస్తుంది. ప్రతి పనికి సమయాన్ని నిర్థేశించుకుని ఆ సమయంలోపు పూర్తీ చేయడం వల్ల లక్ష్యాలు తొందరగా నెరవేరుతాయి. ఏదైనా సాధించగలమనే నమ్మకం పెరుగుతుంది.

Black Tea: బ్లాక్ టీ.. ఇలా తాగితే ఒంట్లో కొవ్వు ఐస్ లా కరిగిపోద్ది..


జెన్యున్ గా ఉండాలి..

ఏ పని చేసినా నిజాయితీ ముఖ్యం. తప్పుడు మార్గాల ద్వారా కెరీర్ లో విజయం సాధించాలి అనుకునే వారు కెరీర్ లో పురోగతి సాధించలేరు. ఏదో ఒక సందర్భంలో తప్పకుండా ఎదురుదెబ్బలు తింటారు. కష్టపడి నిజాయితీగా సాధించే విజయం ఎక్కువ కాలం ఉంటుంది. అదే పక్కవాళ్లను మోసం చేసి, తప్పుడు మార్గాల ద్వారా సాధించే విజయం ఎప్పటికీ ప్రతిభను నిరూపించగలుగుతుంది.

సోమరితనం వద్దు..

ఏ పని చేయాలన్నా మొదట ఆసక్తిగా, చురుగ్గా ఉండాలి. పని పేరు చెప్పగానే దాన్ని చేసేద్దాం అనే మెంటాలిటీతో ఉండాలి. అంతేగాని పని అనగానే బద్దకంగా, సోమరితనంతో మళ్ళీ చేద్దాం అని వాయిదా వేసే మనస్తత్వంతో ఉండరాదు. అలాంటి వారికి విజయం ఎప్పుడూ దూరంగానే ఉంటుంది.

ఇవి కూడా చదవండి..

ఈ టిప్స్ పాటిస్తే.. ఇంగ్లీష్ మాట్లాడటం చాలా ఈజీ..

టీని మళ్లీ వేడి చేస్తున్నారా.. ఆయుర్వేదం చెప్పిన ఈ నిజాలు తెలిస్తే..

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 26 , 2024 | 04:38 PM