Share News

Viral Video: వావ్.. ఆ సింహం స్వాగ్‌కు ఫిదా కావాల్సిందే.. బానెట్ మీద నిల్చుని ఎలా ప్రయాణించిందో చూడండి..

ABN , Publish Date - Oct 20 , 2024 | 08:56 AM

ఇటీవలి కాలంలో వన్య ప్రాణులను చూసేందుకు చాలా మంది జూలకు కాకుండా నేరుగా అడవులకే వెళ్తున్నారు. జంగిల్ సఫారీ పేరుతో అటవీ పర్యటనకు వెళ్తున్నారు. ఆ క్రమంలో వారికి అద్భుతమైన, భయంకర అనుభవాలు ఎదురవుతున్నాయి.

Viral Video: వావ్.. ఆ సింహం స్వాగ్‌కు ఫిదా కావాల్సిందే.. బానెట్ మీద నిల్చుని ఎలా ప్రయాణించిందో చూడండి..
Lion Standing on the bonnet of a moving vehicle

అడవిలోని (Forest) ప్రతి జంతువుకు ప్రత్యేక గుర్తింపు, తనదైన ప్రత్యేకత ఉంటుంది. ఏ జంతువుకు అవసరమైన ప్రత్యేక నైపుణ్యం దానికి ఉంటుంది. అది సింహం కావచ్చు, పులి లేదా ఏనుగు, నక్క కావచ్చు. అడవిలో ఏ జంతువుతోనైనా మనుషులు జాగ్రత్తగా ఉండాలి. ఇటీవలి కాలంలో వన్య ప్రాణులను (Wild Animal) చూసేందుకు చాలా మంది జూలకు కాకుండా నేరుగా అడవులకే వెళ్తున్నారు. జంగిల్ సఫారీ (Jungle Safari Tour) పేరుతో అటవీ పర్యటనకు వెళ్తున్నారు. ఆ క్రమంలో వారికి అద్భుతమైన, భయంకర అనుభవాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూసిన వారు రారాజు (Lion) స్టైల్ చూసి ఫిదా అవుతున్నారు (Viral Video).


@AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం కొందరు వ్యక్తులు జంగిల్ సఫారీకి వెళ్లారు. అన్ని వైపులా రక్షణగా ఉండే జీప్ వేసుకుని అడవిలోకి వెళ్లారు. అక్కడ వారికి ఓ సింహం ఎదురైంది. అది నేరుగా ఆ జీప్ బానెట్‌ పైకి ఎక్కి నిలబడింది. దీంతో ఆ జీప్ డ్రైవర్ జీప్‌ను ముందుకు పోనిచ్చాడు. ఆ సమయంలో సింహం ధైర్యంగా ఆ బానెట్‌పై నిల్చుని ఉంది. గొప్ప స్వాగ్‌తో యాక్షన్ హీరోలా కనిపిస్తోంది. కారు బానెట్‌పై ఎక్కి రైడ్‌ను ఎంజాయ్ చేస్తోంది. సింహం ఎదురుగా ఉన్నా కారులో ఉన్న వారు పూర్తిగా రిలాక్స్‌గా కూర్చున్నారు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 37 లక్షల మందికి పైగా వీక్షించారు. 58 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``ఆకట్టుకునే అందం``, ``ఆ సింహం నడవడానికి ఇష్టపడడం లేదు``, ``యాక్షన్ హీరోలా ఉంది``, ``కారులోని వ్యక్తుల ధైర్యానికి హ్యాట్సాఫ్``, ``సింహాలు ఇలా కూడా చేస్తాయా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Funny Answer Sheet: హిస్టరీ పరీక్షలో ఆ విద్యార్థి రాసిన జవాబు చూస్తే షాక్.. టీచర్ ఏం చేశారంటే..

Picture Puzzle: మీ బ్రెయిన్ స్పీడ్ ఎంత?.. ఈ పార్టీలో దొంగను 5 సెకెన్లలో పట్టుకోండి..


Viral Video: పాకిస్తాన్‌లో అమ్మాయిలు లేరా? ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పేది వింటే షాక్ అవ్వాల్సిందే..


Optical Illusion: మీకు అబ్జర్వేషన్ స్కిల్స్ ఎక్కువా?.. అయితే ఈ ఫొటోలో వజ్రం ఎక్కడుందో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Oct 20 , 2024 | 08:56 AM