Share News

Viral Video: టైమ్ బాగోకపోతే సింహం అయినా కుక్కలా మారాల్సిందే.. ఓ ఇంటి ముందు మృగరాజును ఎలా కట్టేశారో చూడండి..

ABN , Publish Date - Jun 26 , 2024 | 01:33 PM

సింహం అడవికి రారాజు. ఈ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జంతువులలో సింహం ఒకటి. సింహాన్ని చూడడం సంగతి తర్వాత, దాని గర్జన వింటే చాలు భయంతో వణికిపోవాల్సిందే. అంతటి సింహం కూడా టైమ్ బాగోకపోతే ఇబ్బందులు పడక తప్పదు. ఇంటి ముందు కాపలా కుక్కలా మారిపోకతప్పదు.

Viral Video: టైమ్ బాగోకపోతే సింహం అయినా కుక్కలా మారాల్సిందే.. ఓ ఇంటి ముందు మృగరాజును ఎలా కట్టేశారో చూడండి..
Lion is guarding the door

సింహం (Lion) అడవికి రారాజు. ఈ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జంతువులలో సింహం ఒకటి. సింహాన్ని చూడడం సంగతి తర్వాత, దాని గర్జన వింటే చాలు భయంతో వణికిపోవాల్సిందే. అంతటి సింహం కూడా టైమ్ బాగోకపోతే ఇబ్బందులు పడక తప్పదు. ఇంటి ముందు కాపలా కుక్క (Dog)లా మారిపోకతప్పదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆశ్చర్యపోకతప్పదు. ఎందుకంటే ఆ వీడియోలో సింహాన్ని కుక్కలా ఇంటి ముందు కట్టేశారు. ఎందుకంటే ఆ సింహం పరిస్థితి బాగోలేదు మరి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


abdullah అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వీధిలోని పరిస్థితి కనబడుతోంది. ఆ వీధిలో చాలా జంతువులను కట్టేశారు. ఒక ఇంటి ముందు ఒంటెను, ఇతర ఇళ్లల ముందు మేకలు, ఆవులను కట్టేశారు. అయితే ఒక ఇంటి ముందు ఆశ్చర్యకరంగా ఓ సింహాన్ని కట్టేశారు. ఆ సింహం పక్కన కొందరు పిల్లలు, పెద్దలు కూర్చున్నారు. ఆ సింహం చూడడానికి చాలా బలహీనంగా ఉంది. అది అనారోగ్యంతో ఉన్నందు వల్లే అలా ఇంటి ముందు కట్టేశారు (Lion is guarding the door). ఈ వీడియోను భారత్‌లోనే చిత్రీకరించారు. అయితే కరెక్ట్ ప్లేస్ విషయంలో మాత్రం స్పష్టత లేదు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోకు కొన్ని కోట్లలో వ్యూస్ వచ్చాయి. 9 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఆ సింహం చాలా బలహీనంగా ఉంది``, ``ఇది చాలా అన్యాయం``, ``సింహం చాలా అనారోగ్యంగా ఉంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: అమ్మా.. ఎన్ని తెలివితేటలు తల్లి.. రీల్స్ కోసం ఆమె వాడిన టెక్నిక్ చూస్తే గిన్నీస్ బుక్ ఎక్కించాల్సిందే..!


Puzzle: మీ కళ్లు నిజంగా షార్ప్‌గా పని చేస్తున్నాయా? అయితే ఈ ఫొటోలోని చెర్రీ ఎక్కడుందో 8 సెకెన్లలో కనిపెట్టండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 26 , 2024 | 01:33 PM