Share News

లగేజీ లాజిక్‌

ABN , Publish Date - Nov 10 , 2024 | 06:47 AM

ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకుంటే... మొదట గుర్తొచ్చేది లగేజీనే. ట్రావెల్‌ బ్యాగా? సూట్‌కేసా?... పెద్దదా? చిన్నదా?... ఏయే దుస్తులు, వస్తువులు తీసుకెళ్లాలి? అన్నీ సందేహాలే. సూట్‌కేస్‌ సర్దుకోవాలంటేనే తెలియని తలనొప్పి. అందుకే ఇప్పుడు 5-4-3-2-1 ప్యాకింగ్‌ టెక్నిక్‌ వచ్చేసింది. ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. ఇంతకీ ఏమిటా టెక్నిక్‌...

లగేజీ లాజిక్‌

ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకుంటే... మొదట గుర్తొచ్చేది లగేజీనే. ట్రావెల్‌ బ్యాగా? సూట్‌కేసా?... పెద్దదా? చిన్నదా?... ఏయే దుస్తులు, వస్తువులు తీసుకెళ్లాలి? అన్నీ సందేహాలే. సూట్‌కేస్‌ సర్దుకోవాలంటేనే తెలియని తలనొప్పి. అందుకే ఇప్పుడు 5-4-3-2-1 ప్యాకింగ్‌ టెక్నిక్‌ వచ్చేసింది. ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. ఇంతకీ ఏమిటా టెక్నిక్‌...

ఐదు జతల దుస్తులు

విహారయాత్రలు లేదా ఎక్కడికైనా పయనమైతే.. బోలెడన్ని దుస్తులతో ట్రాలీ బ్యాగ్‌ మొత్తం నింపేసుకుంటారు చాలామంది. అలాకాకుండా ఐదు జతల దుస్తులను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా వాటిని అన్ని సందర్భాలకు సూట్‌ అయ్యే విధంగా చూసుకోవాలి. క్యాజువల్‌ వేర్‌, డ్రెస్సియర్‌ ఔట్‌ఫిట్స్‌, వాతావరణానికి తగిన దుస్తులు... ఇలా సందర్భానికి అనుకూలంగా ఉండాలి. ఉదాహరణకు ఒక జత జీన్స్‌, రెండు టాప్స్‌, ఒక స్వెట్టర్‌, ఒక క్యాజువల్‌ వేర్‌ డ్రెస్‌ను ప్యాక్‌ చేసుకోవచ్చు.


నాలుగు జతల బూట్లు

ట్రావెల్‌బ్యాగ్‌లో షూస్‌ ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. కాబట్టి అన్ని రకాల ఔట్‌ఫిట్స్‌కు మ్యాచ్‌ అయ్యేలా నాలుగు జతలను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. వాకింగ్‌ షూస్‌, సాధారణ చెప్పులు, స్నీకర్స్‌, డ్రెస్‌ షూస్‌.. ఇలా ఒక్కొక్కటి ఒక్కో జత ఉండేలా చూసుకోవాలి. ప్రయాణించే ప్రాంతం, అక్కడి వాతావరణం, కార్యకలాపాలకు అనుగుణంగా షూస్‌ ఎంపిక చేసుకోవాలి.


మూడు జతల యాక్ససరీస్‌

యాక్ససరీస్‌.. దుస్తులకు సరైన లుక్‌ అందించడంతోపాటు, విభిన్న పరిస్థితులకు అనుగుణంగా సహాయపడతాయి. ఇందుకోసం స్కార్ఫ్‌, బెల్ట్‌, టోపీ వంటివి ఎంచుకుంటే సరిపోతుంది. అవసరమైతే సన్‌గ్లాసెస్‌ను కూడా చేర్చొచ్చు.

book2.2.jpg

రెండు జతల వెకేషన్‌ ఔట్‌ఫిట్స్‌ విహారయాత్ర బట్టి స్విమ్‌సూట్‌, స్పోర్ట్స్‌ లేదా వర్కవుట్‌ డ్రెస్సులను ప్యాక్‌ చేసుకోవాలి. ముఖ్యంగా బీచ్‌ వెకేషన్‌కు అయితే స్విమ్‌సూట్‌, కవర్‌ అప్‌, హైకింగ్‌ కోసం అయితే వర్కవుట్‌ సెట్‌, జాకెట్‌ను లగేజ్‌లో చేర్చుకోవాలి.


ఒకటి... వ్యక్తిగతం

ఇది పూర్తిగా మన వ్యక్తిగతం. ప్రయాణ సమయంలో కాలక్షేపం కోసం ఒక పుస్తకం గానీ సినిమాల కోసం ట్యాబ్‌గానీ లేదా ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమం కోసం ఒక స్పెషల్‌ డ్రెస్‌ గానీ ఉండొచ్చు.

మరికొన్ని...

- చల్లని ప్రదేశాలకు వెళ్లాలనుకుంటే.. వెచ్చదనం కోసం లేయరింగ్‌ డ్రెస్‌లను వెంటతీసుకెళ్లాలి.

- బట్టలను మడతపెట్టడం కన్నా.. రోల్‌ చేసి పెడితే తక్కువ స్థలం పడుతుంది.

- తటస్థ రంగులను ఎంపిక చేసుకుంటే మంచిది.

Updated Date - Nov 10 , 2024 | 06:47 AM