Viral Video: రూ.3 కోట్ల ఖరీదైన ఇల్లు.. అలల దెబ్బకు ఎలా కొట్టుకుపోయిందో చూడండి.. వీడియో వైరల్!
ABN , Publish Date - Aug 20 , 2024 | 02:18 PM
కొందరు ధనవంతులు ఖరీదైన, ప్రకృతి రమణీయ ప్రాంతాల్లో విలాసవంతమైన ఇళ్లు నిర్మించుకుంటుంటారు. సముద్ర తీర ప్రాంతాల్లోనూ, కొండల మీద అత్యంత ఖర్చుతో ఇళ్లు కట్టుకుంటారు. అయితే ఎంత ఖర్చు పెట్టి ఇళ్లు కట్టుకున్నా ప్రకృతికి అవి ఎదురు నిలబడలేవు.
కొందరు ధనవంతులు ఖరీదైన, ప్రకృతి రమణీయ ప్రాంతాల్లో విలాసవంతమైన ఇళ్లు (Luxurious house) నిర్మించుకుంటుంటారు. సముద్ర తీర ప్రాంతాల్లోనూ, కొండల మీద అత్యంత ఖర్చుతో ఇళ్లు కట్టుకుంటారు. అయితే ఎంత ఖర్చు పెట్టి ఇళ్లు కట్టుకున్నా ప్రకృతికి అవి ఎదురు నిలబడలేవు. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎంత దృఢమైన కట్టడమైనా నేల కూలాల్సిందే. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే షాక్ అవక తప్పదు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఖరీదైన ఇల్లు అలల ధాటికి కుప్పకూలిపోయింది (Viral Video).
@CollinRugg అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ సముద్రపు ఒడ్డున చెక్కతో ఖరీదైన ఇల్లు నిర్మించుకున్నారు. అమెరికా (USA)లోని ఉత్తర కరోలినాలోని అట్లాంటిక్ సముద్ర తీరాన (Beach) రూ.3 కోట్ల ఖర్చుతో నిర్మితమైన ఇంటిని ఓ వ్యక్తి 2018లో కొన్నారు. ఆ ఇంటిలో నాలుగు బెడ్రూమ్‌లు, రెండు బాత్రూమ్‌లు, హాల్, కిచెన్, విశాలమైన బాల్కనీ ఉన్నాయి. అయితే ఆగస్టు 16న వచ్చిన ఎర్నెస్టో హరికేన్ ఒక్కసారిగా ఓ ఇంటిని ధ్వంసం చేసింది. సముద్రపు అలల తాకిడిని తట్టుకునేలా ఈ ఇంటిని 1973లో నిర్మించారు (Beachfront home falls into the Atlantic Ocean ).
హరికేన్ ధాటికి ఆ ఇల్లు ధ్వంసమైంది. దాంతో ఆ ఇంటిని కొన్న వారు వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. కాగా, సముద్రపు అలలు ఆ ఇంటిని పూర్తిగా పడగొట్టేశాయి. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 1.4 కోట్ల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. 34 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: రోడ్డు మీద బైకర్‌కు షాకింగ్ అనుభవం.. ఓ ఎద్దు ఎలా చుక్కలు చూపించిందో చూడండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి