Viral Video: చైనాలో అంతే.. భారీ బిల్డింగ్‌ల మీద నుంచి కార్లు ఎలా వెళ్లిపోతున్నాయో చూడండి..
ABN , Publish Date - Dec 15 , 2024 | 03:32 PM
పొరుగు దేశం చైనాలో ఎన్నో ఇంజినీరింగ్ అద్భుతాలు ఆవిష్కృతమవుతుంటాయి. భారీ జనాభా, వారి అవసరాలకు అనుగుణంగా రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో చైనా నుంచి వచ్చింది.
చైనా (China) చాలా విచిత్రమైన దేశం. ఆ దేశంలో ప్రజలకు చాలా చిత్రమైన ఆలోచనలు వస్తుంటాయి. ఆ క్రమంలో ఎన్నో ఇంజినీరింగ్ అద్భుతాలు ఆవిష్కృతమవుతుంటాయి. భారీ జనాభా, వారి అవసరాలకు అనుగుణంగా రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో చైనా నుంచి వచ్చింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో భారీ భవంతుల పై నుంచి వాహనాలు వేగంగా వెళ్లిపోతున్నాయి. ఆ వీడియో చూసిన నెటిజన్లు విపరీతంగా ఆశ్చర్యపోతున్నారు (Viral Video).
itschina.baby అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తోంది. ఆ బ్రిడ్జ్ కింద వరుసగా భారీ భవంతులు కనిపిస్తున్నాయి. ఆ భవంతులలో జనాలు నివసిస్తున్నారు. ఆ భవంతుల బాల్కనీల్లో ఆరేసిన బట్టలు దర్శనమిస్తున్నాయి. అంటే ఫ్లై ఓవర్ల కిందన కూడా ఆపార్ట్‌మెంట్లు కట్టేసి నివాసయోగ్యంగా మార్చేశారన్నమాట. ఈ వీడియో చూసిన యూజర్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలా జీవించడం సురక్షితమేనా అని చాలా మంది ఆందోళనకు గురవుతున్నారు. వాహనాల శబ్దం, వైబ్రేషన్ కారణంగా అక్కడు నివసిస్తున్న వారికి మనశ్శాంతి ఉండదని చాలా మంది అంటున్నారు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు వేల మంది వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అక్కడ ముందుగా బ్రిడ్జ్ కట్టారా? అపార్ట్‌మెంట్‌లు కట్టారా``, ``చాలా ప్రమాదకర పరిస్థితుల్లో నివసిస్తున్నారు``, ``ఇదెక్కడి అరాచకం``, ``అక్కడ నివసిస్తున్న వారికి నిద్ర సరిగ్గా పడుతుందా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: సరదా తీరిపోయింది.. గుర్రం బళ్లతో రేస్.. చివరకు ఆ కుర్రాళ్ల పరిస్థితి ఏమైందంటే..
Picture puzze Test: మీ బ్రెయిన్ షార్ప్ అనుకుంటున్నారా?.. ఈ బీచ్‌లోని ఆరు డబ్బు సంచులను పట్టుకోండి..
Viral Video: కర్ర పట్టుకొచ్చి పోలీస్ కానిస్టేబుల్ హల్‌చల్.. ట్రక్ డ్రైవర్ మాటలకు భయపడి పరార్..
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితే.. ఆకుల మధ్యనున్న కప్పను 5 సెకెన్లలో పట్టుకోండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి