Share News

Trending: వేరే వ్యక్తితో మంచంపై తన భార్యను పట్టుకున్న భర్త.. ఆరు నెలల జైలు శిక్ష..

ABN , Publish Date - Oct 18 , 2024 | 04:56 PM

తన భార్య వేరొక వ్యక్తితో ఉన్నందుకు.. ఆ వ్యక్తి నుంచి పరిహారం స్వీకరించినందుకుగానూ కోర్టు జైలు శిక్ష విధించింది. 2021లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. 2021 మార్చిలో తూర్పు చైనాలోని షాన్‌డాంగ్‌కు చెందిన 33 ఏళ్ల లూ అనే వ్యక్తి.. తన భార్య కుమార్తెను ప్రైవేట్ ట్యూటర్ వద్దకు తీసుకెళ్లడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు..

Trending: వేరే వ్యక్తితో మంచంపై తన భార్యను పట్టుకున్న భర్త.. ఆరు నెలల జైలు శిక్ష..
File Photo

ప్రపంచంలో కొన్ని ఘటనలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వినడానికి వింతగానూ ఉంటాయి. ఇలాంటి ఓ ఆశ్చర్యకరమైన ఘటన చైనాలో చోటుచేసుకుంది. తన భార్య వేరే వ్యక్తితో మంచంపై నిద్రిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న వ్యక్తికి కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. తన భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సమయంలో భర్త చేసిన ఓ పొరపాటు ఆయనను జైలుకు పంపించింది. తన భార్య వేరొక వ్యక్తితో ఉన్నందుకు.. ఆ వ్యక్తి నుంచి పరిహారం స్వీకరించినందుకుగానూ కోర్టు జైలు శిక్ష విధించింది. 2021లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. 2021 మార్చిలో తూర్పు చైనాలోని షాన్‌డాంగ్‌కు చెందిన 33 ఏళ్ల లూ అనే వ్యక్తి.. తన భార్య కుమార్తెను ప్రైవేట్ ట్యూటర్ వద్దకు తీసుకెళ్లడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు గమనించాడు. దీంతో ఒకరోజు తన భార్యను అతడు అనుసరించాడు. ట్యూటర్ వద్ద కుమార్తెను దించిన తర్వాత ఆమె స్థానిక హోటల్‌లోకి వెళ్లినప్పుడు.. భార్య తనను మోసం చేసిందని లూకు అనుమానం వచ్చింది. దీంతో హోటల్‌లోని గదిలో నగ్నంగా ఉన్న లియుఅనే వ్యక్తితో మంచంపై లో దుస్తులతో భార్య ఉండటాన్ని గమనించి.. గదిలోకి ప్రవేశించి.. తన భార్యను, లియును లూ కొట్టాడు. చివరకు రాజీకి వచ్చి తన భార్యతో ఉన్నందుకు లియు దగ్గర లూ పరిహారంగా మూడు వాయిదాల్లో 25వేల యువాన్లు పొందాడు. అంటే దాదాపు 3వేల300 డాలర్లను లూ తీసుకున్నాడు. దీనిపై లియు ఫిర్యాదు చేయగా.. ఈ విషయం విడాకుల కేసు విచారణ సమయంలో లూ తెలుసుకుని షాకయ్యాడు.


భార్యనే సూత్రధారి..!

పరిహారం తీసుకున్న తర్వాత ఈ ఘటనపై లియు ఫిర్యాదు వెనుక తన భార్య ఉన్నట్లు లూ అనుమానం వ్యక్తం చేశాడు. చివరకు కోర్టులో విడాకుల కేసు విచారణ సమయంలో లూ ఆర్థిక నష్టపరిహారం చెల్లించాలని అడిగినందుకు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.


33 ఏళ్ల లూ మార్చి 2022లో కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లగా జిబో ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్థించింది. అయినప్పటికీ జిబో ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు నిర్ణయాన్ని అప్పీల్ చేయడానికి లూ ప్రయత్నించాడు, కాని ఇంటర్మీడియట్ కోర్టు అతని అభ్యర్థనను డిసెంబర్ 2022లో మరోసారి తిరస్కరించింది. చివరి ప్రయత్నంగా.. షాన్‌డాంగ్ ప్రావిన్షియల్ హైకోర్టులో తీర్పును సవాలు చేశాడు. దీంతో కేసులో వాస్తవాలను ధృవీకరించడానికి తగిన సాక్ష్యాలు కనిపించడంలేదని, కేసును పునఃపరిశీలించాలని జిబో ఇంటర్మీడియట్ కోర్టును ప్రావిన్షియల్ హైకోర్టు ఆదేశించింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 18 , 2024 | 05:19 PM