Share News

Viral Video: పిచ్చి పీక్స్‌కు చేరింది భయ్యా..! రీల్స్ కోసం ప్రాణాలతో రిస్క్.. ట్రాక్టర్ వీల్ మధ్యలోకి దూరి..!

ABN , Publish Date - Jun 25 , 2024 | 12:41 PM

ప్రస్తుత డిజిటల్ మీడియా యుగంలో చాలా మందికి రీల్స్ పిచ్చి పట్టుకుంది. సోషల్ మీడియాలో ఎలాగైనా వైరల్ అయ్యేందుకు, వీలైనన్ని లైక్స్, వ్యూస్ సంపాదించేందుకు ఎవరికి తోచిన ప్రయత్నం వారు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ప్రాణాలను సైతం రిస్క్‌లో పెట్టి రీల్స్ చేస్తున్నారు.

Viral Video: పిచ్చి పీక్స్‌కు చేరింది భయ్యా..! రీల్స్ కోసం ప్రాణాలతో రిస్క్.. ట్రాక్టర్ వీల్ మధ్యలోకి దూరి..!
Dangerous Stunt on moving Tractor

ప్రస్తుత డిజిటల్ మీడియా యుగంలో చాలా మందికి రీల్స్ (Reels) పిచ్చి పట్టుకుంది. సోషల్ మీడియా (Social Media)లో ఎలాగైనా వైరల్ అయ్యేందుకు, వీలైనన్ని లైక్స్, వ్యూస్ సంపాదించేందుకు ఎవరికి తోచిన ప్రయత్నం వారు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ప్రాణాలను సైతం రిస్క్‌లో పెట్టి రీల్స్ చేస్తున్నారు (Dangerous Stunts). అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది (Viral Video).


@PalsSkit అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి ట్రాక్టర్ (Tractor) టైర్‌లో దూరి కూర్చున్నాడు. ఓ వ్యక్తి ఆ ట్రాక్టర్ నడపడం ప్రారంభించాడు. ట్రాక్టర్ ముందుకు వెళుతుండడంతో టైర్‌లో ఉన్న ఆ వ్యక్తి గుండ్రంగా తిరగడం ప్రారంభించాడు. 15 సెకన్ల పాటు అలా ట్రాక్టర్ టైరు (Tractor Wheel)తో పాటు తిరుగుతూనే ఉన్నాడు. ట్రాక్టర్ నడిపే వ్యక్తి ఏ కాస్త వేగంగా డ్రైవ్ చేసినా ఆ వ్యక్తి కింద పడిపోయేవాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.


ఈ వీడియోను వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా చాలా మంది వీక్షించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్లు చేశారు. ``ఈ పిచ్చి ఎక్కడి వరకు వెళుతుందో``, ``ఇతని కంటే పిచ్చివాడు నయం``, ``ఇలా కూడా వైరల్ అవ్వచ్చు మరి``, ``ట్యాలెంట్ లేనపుడు ఇలాంటి పిచ్చి పనులు చేసే అందరినీ ఆకట్టుకోవాలనుకుంటారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వేసవి ఎండకు చెక్ పెట్టాల్సింది ఇలాగే మరి.. ఓ వ్యక్తి వినూత్న ఆలోచనపై నెటిజన్ల కామెంట్లు!


Viral Video: ఈ చిన్న ట్రిక్‌తో ఎలా మోసం చేస్తున్నారో చూడండి.. కళ్లకు కట్టినట్టు చూపించిన వ్యాపారి!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 25 , 2024 | 04:58 PM