Share News

Viral Video: ఇది బైక్ లాంటిది.. కానీ బైక్ కాదు.. ఈ కుర్రాడి తెలివితేటలకు భారతరత్న ఇవ్వాల్సిందే..!

ABN , Publish Date - Jul 06 , 2024 | 04:06 PM

తెలివితేటలు, సృజనాత్మకత ఎవరి సొత్తూ కాదు. కాస్త బుర్ర ఉపయోగిస్తే ఎవరైనా అద్భుతాలు చేయగలరు. ఇతరులను ఆశ్చర్యపరిచే ఆవిష్కరణలు చేయగలరు. అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Viral Video: ఇది బైక్ లాంటిది.. కానీ బైక్ కాదు.. ఈ కుర్రాడి తెలివితేటలకు భారతరత్న ఇవ్వాల్సిందే..!
Bike

తెలివితేటలు, సృజనాత్మకత ఎవరి సొత్తూ కాదు. కాస్త బుర్ర ఉపయోగిస్తే ఎవరైనా అద్భుతాలు చేయగలరు. ఇతరులను ఆశ్చర్యపరిచే ఆవిష్కరణలు చేయగలరు. అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు (Jugaad Video) ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒకరు కారును హెలికాఫ్టర్‌గా మార్చారు, మరొకరు ఇటుకలతో కూలర్ తయారు చేశారు. ప్రస్తుతం ఓ కుర్రాడు పెట్రోల్ అవసరం లేని బైక్‌ (Bike)ను తయారు చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


sonufitness535 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కుర్రాడు బైక్ మీద ప్రయాణిస్తున్నాడు. అయితే ఆ బైక్ పెట్రోల్‌తో నడిచేది కాదు. దానికి ఇంజిన్ లేదు. సైకిల్ తొక్కినట్టు తొక్కితేనే అది ముందుకు వెళుతుంది. ఓ కుర్రాడు బైక్‌కు చైన్, పెడల్ అమర్చి సైకిల్‌ (Bicycle)లా మార్చేశాడు. సైకిల్ తొక్కినట్టు తొక్కితేనే ఆ బైక్ ముందకు కదులుతుంది. రోడ్డు మీద వెళుతున్న ఆ కుర్రాడిని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.


ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 5.2 కోట్ల మంది వీక్షించారు. 12 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఈ కుర్రాడికి తప్పకుండా భారతరత్న ఇవ్వాలి``, ``ఖర్చు లేదు.. ఆరోగ్యానికి మంచిది``, ``ఈ బైక్ చూస్తే ట్రాఫిక్ పోలీసులు షాకవుతారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: ఈ ప్రియుడికి ముందు చూపు చాలా ఎక్కువ.. ప్రియురాలికి ఎలాంటి రింగ్ ఇచ్చాడో తెలిస్తే షాకవ్వాల్సిందే..!


Viral: వామ్మో.. తనను కరిచిన పామును తిరిగి కరిచాడు.. తర్వాతేం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 06 , 2024 | 04:06 PM