Share News

Viral Video: ప్లాస్టిక్ డ్రమ్ముతో కూలర్.. వేసవిలో వెరైటీ ఐడియాలతో రకరకాల కూలర్లు.. వీడియో వైరల్!

ABN , Publish Date - May 08 , 2024 | 12:46 PM

ప్రస్తుత వేసవిలో ఎండలకు జనాలు మాడిపోతున్నారు. వేడికి తట్టుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. చల్లదనం కోసం రకరకాలు ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మంది వెరైటీ ఐడియాలతో కూలర్లను తయారు చేస్తున్నారు. ఆయా జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Viral Video: ప్లాస్టిక్ డ్రమ్ముతో కూలర్.. వేసవిలో వెరైటీ ఐడియాలతో రకరకాల కూలర్లు.. వీడియో వైరల్!
Cooler

ప్రస్తుత వేసవిలో (Summer) ఎండలకు జనాలు మాడిపోతున్నారు. వేడికి తట్టుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. చల్లదనం కోసం రకరకాలు ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మంది వెరైటీ ఐడియాలతో కూలర్లను (Coolers) తయారు చేస్తున్నారు. ఆయా జుగాడ్ వీడియోలు (Jugaad videos) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి ప్లాస్టిక్ డ్రమ్ముతో కూలర్‌ను (Cooler in Plastic Box) తయారు చేశాడు. ఆ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు (Viral Video).


వైరల్ అవుతున్న వీడియోలో, ఒక వ్యక్తి పెద్ద ఖాళీ ప్లాస్టిక్ బాక్స్‌తో కూలర్ తయారు చేశారు. ఆ బాక్స్‌ను అన్ని వైపుల నుంచి కత్తిరించి మూడు వైపులా చల్లటి గడ్డి పెట్టారు. ఒకవైపు ఫ్యాన్ అమర్చారు. ఆ గడ్డి వైపు నీటి పంప్‌ను ఏర్పాటు చేశారు. ఇది గడ్డికి నీటిని సరఫరా చేస్తుంది. ఆ చల్లి నీటి నుంచి వచ్చే గాలి చల్లగా అమర్చారు. ఆ బాక్స్‌కు ముందు వైపు స్విచ్ఛ్‌లను కూడా అమర్చారు. ఈ పోర్టబుల్ కూలర్‌ను ఎక్కడైనా తీసుకెళ్లిపోవచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


@jaani_marwadi అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోకు 80 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 2.6 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఏదో ఒకరోజు చైనా కంటే భారత్ మరింత ముందుకు వెళుతుంది``, ``ఇది దేశీ ప్రతిభ``, ``ఈ టెక్నాలజీ భారత్ దాటి వెళ్లకూడదు``, ``మనం ఇలాంటి ఆలోచనలతోనే చంద్రుడి మీదకు వెళ్లాం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Puzzle: మీ కళ్లకు రియల్ టెస్ట్.. ఈ ఫొటోలో టూత్ బ్రష్ ఎక్కడుందో 10 సెకెన్లలో కనిపెట్టండి!


Viral Video: తల్లి మనసు అలాగే ఉంటుంది.. పిల్లలను రక్షించుకునేందుకు ఓ నాగుపాము ఏం చేస్తోందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 08 , 2024 | 12:46 PM