Share News

Viral Video: రీల్స్ కోసం.. ‘పిల్ల చేష్టలు’

ABN , Publish Date - Jul 05 , 2024 | 02:58 PM

ఒక్కసారిగా ఫేమస్ అయిపోవాలి. అందుకోసం మనిషి.. ఏ మాత్రం ముందు వెనుక ఆలోచించడం లేదు. తన కారణంగా.. తనకే కాదు.. ఇతరులకు సైతం నష్టం.. అది ప్రాణ, ఆస్తి రూపంలో జరుగుతుందనే కనీస భావన కూడా లేకుండా ప్రవర్తిస్తున్నాడు.

Viral Video: రీల్స్ కోసం.. ‘పిల్ల చేష్టలు’
Man overfills SUV's tank for reel

ఒక్కసారిగా ఫేమస్ అయిపోవాలి. అందుకోసం మనిషి.. ఏ మాత్రం ముందు వెనుక ఆలోచించడం లేదు. తన కారణంగా.. తనకే కాదు.. ఇతరులకు సైతం నష్టం.. అది ప్రాణ, ఆస్తి రూపంలో జరుగుతుందనే కనీస భావన కూడా లేకుండా ప్రవర్తిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే.. పిచ్చి పీక్స్‌కు చేరిన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. అందుకు రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఓ వ్యక్తి... రీల్స్ కోసం.. ఏం చేశాడో.. ఎలా వ్యవహరించాడో ఈ వీడియో చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

తన ఎస్‌యువి కారులో డీజిల్ నింపుతూ.. బయటకు కారిపోయేలా చేశాడు. అనంతరం ఏదో సాధించినట్లు.. విక్టరీ సింబల్‌తో చేతిని చూపిస్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. మరోవైపు రీల్స్ కోసం సదరు వ్యక్తి వ్యవహరించిన తీరు పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వీడియోపై జర్నలిస్ట్ నిశాంత్ శర్మ స్పందించారు. దీనిని అజ్మీర్ పోలీసులకు షేర్ చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఎక్స్ వేదికగా జర్నలిస్ట్ విజ్జప్తి చేశారు.


తన తోటి వారి భద్రతను విస్మరించే విధంగా అతడి వ్యవహాశైలి ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ట్యాంక్ నిండిపోయి డిజిల్ నేలపాలైందని పేర్కొంటున్నారు. ఇది పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటన వల్ల.. భారీ ప్రమాదాలు జరిగే అవకాశముందని చెబుతున్నారు. సదరు వ్యక్తి రీల్స్ కోసం.. గ్యాస్ స్టేషన్‌లో అటెండెంట్‌ను పక్కన పెట్టి.. అతడు తన కారులో డీజిల్ నింపడం.. అనంతరం అతడు వ్యవహరించిన తీరు పట్ల విమర్శుల సైతం వెల్లువెత్తాయి. అయితే అతడి డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని పోలీసులకు ఈ సందర్భంగా నెటిజన్లు సూచిస్తున్నారు.

Also Read: Amit Shah: ఆ తర్వాతే.. అసెంబ్లీ ఎన్నికలు..!


ఇక వీడియోపై అజ్మీర్ పోలీసులు సైతం స్పందించారు. ఈ విషయాన్ని ఓ వ్యక్తి తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఇప్పటికే దీనిపై సంబంధిత పోలీస్ ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశామన్నారు. అలాగే రీల్స్ చేసిన వ్యక్తితోపాటు పెట్రోల్ బంక్‌లోని అటెండెంట్‌పై మోటర్ వెహికల్ చట్టం కింద కేసు నమోదు చేయవచ్చన్నారు. అందుకోసం న్యాయపరంగా వారిపై చర్యలు తీసుకుంటున్నామని వారు స్పష్టం చేశారు. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు 530,000 మంది ఈ వీడియోను వీక్షించగా.. 1200 మంది షేర్ చేశారు.

Updated Date - Jul 05 , 2024 | 02:58 PM