Viral: ఫుట్‌బాల్ మైదానంలో షాకింగ్ ప్రపోజల్.. ప్రేమలో ఉన్న ఇద్దరు పురుషులు ఏం చేశారంటే..
ABN , Publish Date - Mar 16 , 2024 | 09:57 AM
తాజాగా ఆస్ట్రేలియాలోని ఓ ఫుట్‌బాల్ మైదానంలో ఓ వ్యక్తి తన స్నేహితుడి ఎదుట మోకాలిపై కూర్చుని బహిరంగంగా లవ్ ప్రపోజ్ చేశాడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో చాలా మందిని ఆశ్చర్యపరిచాయి.
మైదానాల్లో జరిగే వింత వింత ఘటనలకు సంబంధించిన వీడియోలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా (Australia)లోని ఓ ఫుట్‌బాల్ మైదానంలో (Foot ball stadium) ఓ వ్యక్తి తన స్నేహితుడి ఎదుట మోకాలిపై కూర్చుని బహిరంగంగా లవ్ ప్రపోజ్ (Love Proposal) చేశాడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. ఆస్ట్రేలియాకు చెందిన ఏస్ ఫుట్‌బాల్ ఆటగాడు జోష్ కావల్లో (Australian footballer Josh Cavallo) ఈ ఘటనతో వార్తల్లో నిలిచాడు.
ఫుట్ బాలర్ జోష్ కావల్లో, అతడి స్నేహితుడు లైటన్ మోరెల్‌తో చాలా కాలంగా ప్రేమలో ఉన్నాడు. ఇద్దరూ సహజీవనం కూడా చేస్తున్నారు. జోష్ కావల్లో అడిలైడ్ యునైటెడ్ తరపున లీగ్ మ్యాచ్‌లు ఆడుతుంటాడు. అతడి స్నేహితుడు లైటన్ మోరెల్ వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. ఇద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. తాను 16 ఏళ్ల వయసు నుంచే స్వలింగ సంపర్కుడినని కొద్ది రోజుల క్రితం జోష్ ప్రకటించి సంచలనం రేకెత్తించాడు. తాజాగా ఫుట్‌బాల్ మైదానంలో బహిరంగంగా తన గే మ్యారేజ్ గురించి బయటపెట్టాడు.
ఫుట్‌బాల్ మైదానంలో లైటన్ మోరెల్ ముందు మోకాళ్లపై కూర్చుని ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేశాడు. ఆ ఫొటలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ``నా భాగస్వామితో ఈ సంవత్సరాన్ని ప్రేమిస్తున్నా. మిస్టర్ అండ్ మిస్టర్ త్వరలో రాబోతున్నారు. నాకు ఎంతో మద్దతుగా నిలిచిన ఆడిలైడ్ యునైటెడ్ క్లబ్‌కు ధన్యవాదాలు`` అంటూ జోష్ పేర్కొన్నాడు.