Viral Video: పులి మీద సవారీ.. పైన కూర్చున్న వ్యక్తిని పులి ఎలా మోసుకెళ్లిందో చూడండి.. షాకింగ్ వీడియో వైరల్..
ABN , Publish Date - Oct 07 , 2024 | 06:40 PM
ప్రస్తుతం వైరల్ అవుతున్న షాకింగ్ వీడియోలో ఓ వ్యక్తి ఏకంగా పులిపై స్వారీ చేశాడు. పాకిస్తాన్‌కు చెందిన ఆ వ్యక్తి తన సాహసాన్ని వీడియో తీయించుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రస్తుతం చాలా మంది వన్య మృగాలను (Wild Animals) పెంచుకోవడాన్ని ఓ స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు. దుబాయ్ (Dubai) వంటి దేశాల్లో పులులు (Tigers), సింహాలు (Lion) వంటి క్రూర మృగాలను పెంపుడు జంతువుల్లా ఇంట్లో పెంచుకుంటున్నారు. వాటితో కలిసి వాకింగ్‌కు వెళుతున్నారు. అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న షాకింగ్ వీడియోలో ఓ వ్యక్తి ఏకంగా పులి (Pet Tiger)పై స్వారీ చేశాడు. పాకిస్తాన్ (Pakistan)కు చెందిన ఆ వ్యక్తి తన సాహసాన్ని వీడియో తీయించుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది (Viral Video).
nouman.hassan1 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి పులితో సాహసం చేశాడు. చైన్ కట్టి ఉన్న పులి వీపుపై కూర్చున్నాడు. పులి అతడిని మోస్తూ కొంతదూరం నడిచింది. సరిగ్గా కూర్చోకపోవడంతో అతడు జారిపోయాడు. ఆ తర్వాత పులి నేరుగా బోను దగ్గరకు వెళ్లింది. ఆ బోనులో సింహాలు, పులులు ఉన్నాయి. అక్కడ ఆగి ఉన్న పులిపై ఆ వ్యక్తి మరోసారి ఎక్కి కూర్చున్నాడు. పులులను పెంపుడు జంతువులుగా భావిస్తున్న ధోరణి పాకిస్తాన్‌లో వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా ధనిక వర్గాల్లో ఇది ఎక్కువగా ఉంది. ఇది అనేక తీవ్రమైన సమస్యలకు కూడా దారితీస్తోంది.
ఈ వైరల్ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ``ఇది చాలా ప్రమాదకరం, అమానవీయం``, ``ఆ జంతువును బాధపెట్టవద్దు``, ``క్రూర మృగాలు మీ వినోదం కోసం కాదు``, ``ఇది నిజమైన క్రూరత్వం``, ``పులులు, సింహాలను స్వేచ్ఛగా వదిలేయండి, లేకపోతే మీకే ప్రమాదం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వావ్.. మ్యాగీని ఇలా కూడా తయారు చేయవచ్చా? రోటీ మ్యాగీతో ఆరోగ్యం అంటున్న నెటిజన్లు..
Optical Illusion: ఈ గుహలో ఓ కుక్క దాక్కుంది.. 5 సెకెన్లలో కనిపెడితే మీ కళ్లు చాలా పవర్‌ఫుల్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..