Share News

Viral Video: పెంపుడు కుక్కలా సింహాన్ని ఒళ్లో కూర్చోబెట్టుకున్నాడు.. చివరకు ఏం జరిగిందో చూస్తే షాక్!

ABN , Publish Date - Aug 25 , 2024 | 01:21 PM

ఇటీవలి కాలంలో కొందరు ధనవంతులు క్రూర మృగాలను ఇళ్లలో పెంచుకోవడాన్ని స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు. ముఖ్యంగా దుబాయ్‌లోని ధనవంతులు పులులు, సింహాలు వంటి జంతువులను పెంచుకుంటున్నారు. ఆ పులులకు, సింహాలకు ఎంత ట్రైనింగ్ ఇచ్చినా అవి అంత సులభంగా మచ్చిక కావు.

Viral Video: పెంపుడు కుక్కలా సింహాన్ని ఒళ్లో కూర్చోబెట్టుకున్నాడు.. చివరకు ఏం జరిగిందో చూస్తే షాక్!
Pet Lion

ఇటీవలి కాలంలో కొందరు ధనవంతులు క్రూర మృగాలను (Wild Animals) ఇళ్లలో పెంచుకోవడాన్ని స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు. ముఖ్యంగా దుబాయ్‌ (Dubai)లోని ధనవంతులు పులులు (Tigers), సింహాలు (Lions) వంటి జంతువులను పెంచుకుంటున్నారు. ఆ పులులకు, సింహాలకు ఎంత ట్రైనింగ్ ఇచ్చినా అవి అంత సులభంగా మచ్చిక కావు. ఏదో ఒక సందర్భంలో అవి కోపం తెచ్చుకుని తమ ప్రతాపం చూపిస్తాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. @AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి తన పెంపుడు సింహంతో (Pet Lion) కలిసి సేద తీరుతున్నాడు. సోఫాలో కూర్చుని తన పెంపుడు సింహాన్ని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. దానిని నిమురుతూ కూర్చున్నాడు. అయితే ఆ సమయంలో ఆ సింహం బుద్ధిగా కూర్చోలేదు. కొద్ది సేపటి తర్వాత పెద్దగా గాండ్రించింది. దెబ్బకి ఆ వ్యక్తి భయపడ్డాడు. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ సింహాన్ని హింసించడం మానుకోవాలని ఆ వ్యక్తికి హితువు చెబుతున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 2 కోట్ల మందికి పైగా వీక్షించారు. 96 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``మొదటి ఇది ఏఐ జనరేటెడ్ వీడియో అనుకున్నాను``, ``సింహాన్ని స్వేచ్ఛగా పరిగెత్తనివ్వండి``, ``ఆ సింహం చాలా విచారకర స్థితిలో ఉంది``, ``ఆ సింహాన్ని అడవిలో వదలండి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: పెళ్లి పీటలెక్కబోయే ముందు కూడా స్కూల్‌కు వెళ్లి పాఠాలు చెప్పిన టీచర్.. అసలు కారణమేంటంటే..


Viral Video: వామ్మో.. ధైర్యవంతులైతేనే ఈ వీడియో చూడండి.. కింగ్ కోబ్రా భయంకర రూపం చూస్తే నివ్వెరపోవాల్సిందే..!


Viral: ఛీ..ఛీ.. మార్చురీలో ఇదేం పని.. 75 శవాల మధ్య అసభ్యకర స్థితిలో కెమెరాకు చిక్కిన జంట.. వీడియో తీస్తున్నా..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 25 , 2024 | 01:21 PM