Share News

Viral Video: పిచ్చి పీక్స్‌కు చేరితే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి.. రీల్స్ కోసం చేసిన స్టంట్ చివరకు ఎలా ముగిసిందంటే..

ABN , Publish Date - Oct 05 , 2024 | 09:19 PM

సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించేందుకు కొందరు రకరకాల పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు బహిరంగా ప్రదేశాల్లో చేయకూడని పనులు చేస్తున్నారు. మరికొందరు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ ప్రమాదకర సాహసాలు చేస్తున్నారు.

Viral Video: పిచ్చి పీక్స్‌కు చేరితే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి.. రీల్స్ కోసం చేసిన స్టంట్ చివరకు ఎలా ముగిసిందంటే..
Youth performs bike stunt

సోషల్ మీడియా (Social Media) అందుబాటులోకి వచ్చాక చాలా మంది వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించేందుకు రకరకాల పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు బహిరంగ ప్రదేశాల్లో చేయకూడని పనులు చేస్తున్నారు. మరికొందరు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ ప్రమాదకర సాహసాలు (Dangerous Stunt) చేస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ కుర్రాడు అలాగే బైక్‌తో ప్రాణాంతక సాహసం (Bike Stunt) చేశాడు. చివరకు ఆ కుర్రాడి పరిస్థితి ఏమైందో తెలిస్తే ఆందోళన చెందాల్సిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


arariya_wala అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ కుర్రాడు పల్సర్ బైక్ మీద ప్రయాణం చేస్తున్నాడు. హఠాత్తుగా బైక్ స్టంట్ చేయడం ప్రారంభించాడు. బైక్ వేగంగా వెళ్తుండగా దాని మీద లేచి నిల్చునే ప్రయత్నం చేశాడు. బైక్ హ్యాండిల్ వదిలేసి సీటుపై రెండు కాళ్లతో నిల్చున్నాడు. ఆ క్రమంలో బ్యాలెన్స్ కోల్పోయాడు. దీంతో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన పొదల్లోకి దూసుకుపోయింది. ఆ కుర్రాడు రోడ్డుపై పడిపోయాడు. ఆ కుర్రాడి తల రోడ్డును బలంగా తాకింది. దీంతో ఆ కుర్రాడు గాయాలపాలయ్యాడు. ఆ కుర్రాడి స్టంట్‌ను ముందు బైక్ మీద వెళ్తున్న అతడి స్నేహితులు వీడియో తీశారు.


ఈ వైరల్ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. దాదాపు 1.4 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇలాంటి మూర్ఖత్వం వద్దు``, ``ఇలాంటి పని చేసే ముందు ఒక్కసారి మీ కుటుంబం గురించి ఆలోచించండి``, ``ఎంతో శిక్షణ తీసుకుంటే తప్ప ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదు``, ``రీల్స్ కోసం ప్రాణాలను పణంగా పెడతారా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఇలాంటి భర్త దొరకాలంటే ఏ పూజలు చేయాలో..?, వధువుకు ఎలా వెల్కమ్ చెప్పాడో చూడండి..


Optical Illusion: మీ కళ్ల పవర్‌కు టెస్ట్.. ఈ ఫొటోలో ``888`` మధ్య ఉన్న ``808``ని 8 సెకెన్లలో పట్టుకోండి..


Viral Video: తెలివి ఉండాలే గానీ, పురుగును కూడా ఇలా వాడుకోవచ్చు.. ఓ యువకుడి టెక్నిక్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..


Viral Video: ప్రేయసితో కలిసి స్కూటీపై వెళ్తున్న భర్త.. అతడి భార్య ఎలాంటి షాకిచ్చిందంటే.. వీడియో వైరల్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Oct 05 , 2024 | 09:19 PM