Share News

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. ఓ బాలిక తన తల్లిని ఎలా కాపాడిందో చూడండి.. వీడియో వైరల్..

ABN , Publish Date - Sep 09 , 2024 | 07:35 AM

కళ్ల ముందు ఏదైనా ప్రమాదం జరిగితే ఏం చేయాలో అర్థం కాదు. ఒకవేళ ఆ ప్రమాదంలో మన ఆత్మీయులు ఉంటే మెదడు మొద్దుబారి పోతుంది. అయితే మంగుళూరుకు చెందిన ఓ బాలిక తన కళ్ల ముందు భారీ ప్రమాదం జరిగినా భయపడకుండా తన తల్లిని కాపాడేందుకు ప్రయత్నించింది.

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. ఓ బాలిక తన తల్లిని ఎలా కాపాడిందో చూడండి.. వీడియో వైరల్..
Brave schoolgirl in Mangaluru turns auto to save mother

కళ్ల ముందు ఏదైనా ప్రమాదం (Accident) జరిగితే ఏం చేయాలో అర్థం కాదు. ఒకవేళ ఆ ప్రమాదంలో మన ఆత్మీయులు ఉంటే మెదడు మొద్దుబారి పోతుంది. ఎలా స్పందించాలో పెద్ద వాళ్లకే అర్థం కాదు. అయితే మంగుళూరు (Mangaluru )కు చెందిన ఓ బాలిక (schoolgirl) తన కళ్ల ముందు భారీ ప్రమాదం జరిగినా భయపడకుండా తన తల్లి (Mother)ని కాపాడేందుకు ప్రయత్నించింది. ఆటో (Auto)ను పైకి ఎత్తింది. దీంతో ఆమె తల్లి భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డు అయింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆ బాలిక ధైర్యాన్ని (Brave Girl) ప్రశంసిస్తున్నారు (Viral Video).


మంగుళూరుకు చెందిన ఓ మహిళ తన కూతురిని ట్యూషన్ నుంచి తీసుకొస్తూ రోడ్డు దాటుతోంది. ఆ సమయంలో ఓ ఆటో అతి వేగంగా వచ్చింది. ఆ మహిళను ఢీకొని ఆమెపై పడిపోయింది. పక్కన ఉన్న కూతురు పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిపై పడిన ఆటోను పైకి లేపడానికి ప్రయత్నించింది. అంతలో ఆటోలో ఉన్న వారు కూడా కిందకు దిగి ఆటోను పైకి లేపారు. దీంతో ఆ బాలిక తల్లి స్వల్ప గాయాలతో బయటపడింది. చుట్టూ ఉన్న స్థానికులు ఆ మహిళను వెంటనే ఆస్ప్రతికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది.


ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను కొన్ని వేల మంది వీక్షించారు. ఆ బాలికపై ప్రశంసలు కురిపించారు. ``ఆ బాలికకు కచ్చితంగా అవార్డు ఇవ్వాలి. భయపడకుండా ఏం చేయాలో అది చేసింది``, ``సమయస్ఫూర్తి అంటే అదే``, ``ఆ బాలికను సత్కరించాలి``, ``ఆ బాలిక స్పందన అమోఘం``, ``తల్లి కోసం ఆ బాలిక ఎంత తపన పడిందో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: కాళ్లు లేకపోతేనేం.. ఈమె ధైర్యం, పట్టుదల ముందు ఎవరు సరిపోతారు.. ఆమె డ్యాన్స్ చూడండి..


Viral Video: ఆహా.. ఈ కుర్రాడి ట్యాలెంట్‌కు అవాక్కవ్వాల్సిందే.. అమ్మాయిలా ఎలా డ్యాన్స్ చేశాడో చూడండి..


Picture Puzzle: మీ కళ్లకు స్పెషల్ టెస్ట్.. ఈ రెండు ఫొటోలోని మూడు తేడాలను 10 సెకెన్లలో కనుక్కోండి...


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 09 , 2024 | 07:35 AM