Share News

అగ్గిపుల్ల... అయ్యిందిలా...

ABN , Publish Date - Nov 17 , 2024 | 11:38 AM

‘అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల... కాదేదీ కళకు అనర్హం’ అంటాడు స్కాట్లాండ్‌కు చెందిన శిల్పకారుడు డేవిడ్‌ మాక్‌. అగ్గిపుల్లలతో మహాత్మాగాంధీ, చార్లీచాప్లిన్‌, మార్లిన్‌ మన్రో వంటి ప్రసిద్ధుల ప్రతిమలు రూపొందించడంలో దిట్ట ఆయన. మ్యాచ్‌స్టిక్స్‌ కళాఖండాల తయారీలో రకరకాల రంగుల్లో లభించే జపాన్‌ అగ్గిపుల్లలను వినియోగించాడు.

book14.jpg

ముందుగా మట్టి బొమ్మను తయారుచేసి, దానికి శిల్పాన్ని చెక్కినట్టుగా... అగ్గిపుల్లలు గుచ్చడం ద్వారా రూపాన్ని సృష్టిస్తాడు మాక్‌. ఇక్కడితోనే ఆయన ప్రతిభ అయిపోలేదు... కారు టైర్లు, హ్యాంగర్లు, న్యూస్‌పేపర్లు... ఇలా రకరకాల వస్తువులతో కూడా ఆకట్టుకునే రూపాలు సృష్టించి ఆశ్చర్యానికి గురిచేస్తాడు.

Updated Date - Nov 17 , 2024 | 11:39 AM