Share News

Viral: బైక్‌పై భారీ ఒంటె తరలింపు.. నోరెళ్లబెడుతున్న జనాలు! వైరల్ వీడియో!

ABN , Publish Date - Dec 06 , 2024 | 01:10 PM

బైక్‌పై ఒంటెను తరలిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. ఈ దృశ్యాలు జనాలను షేక్ చేస్తున్నాయి.

Viral: బైక్‌పై భారీ ఒంటె తరలింపు.. నోరెళ్లబెడుతున్న జనాలు! వైరల్ వీడియో!

ఇంటర్నెట్ డెస్క్: అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లోని ప్రజలకు ద్విచక్రవాహనానికి మించిన రవాణా సాధనం మరొకటి లేదు. ఐదుగురు, ఆరుగురు సభ్యులున్న కుటుంబాల వారు కూడా ఒకే బైక్‌పై కూర్చుని ప్రయాణించిన వీడియో నిత్యం వైరల్ అవుతుంటాయి. కొందరు గంపెడు సామానును కూడా సునాయాసంగా బైక్‌పై తరలిస్తుంటారు. అయితే, వీటన్నిటినీ తలదన్నే వీడియో ఒకటి ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. బైక్‌పై ఏకంగా ఒంటెను తరలిస్తున్న తీరును వీడియోలో చూసి జనాలు షాకైపోతున్నారు (Viral).

Viral: ఏం ఐడియా బ్రో.. గుళ్లల్లో చెప్పులు చోరీ కాకుండా ఉండేందుకు భలే చిట్కా!


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఇద్దరు వ్యక్తులు ఓ ఒంటెను సునాయాసంగా బైక్‌పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్లారు. ఒకరు బైక్ నడుపుతుండగా మరో వ్యక్తి వెనకాల కూర్చున్నాడు. వారి మధ్య ఒంటెను కూర్చోపెట్టుకున్నాడు. అది లేచి నిలబడి హడావుడి చేయకుండా ఉండేందుకు దాని కాళ్లను కూడా కట్టేశారు. అటూ ఇటూ జరిగిపోకుండా మధ్యలో కూర్చోబెట్టుకుని గట్టిగా పట్టుకున్నారు. ఇదంతా తనకు అలవాటే అన్నట్టు ఒంటె కూడా చాలా కుదురుగా కూర్చుని జర్నీని ఎంజాయ్ చేసింది.

Viral: సిబ్బంది కళ్లుకప్పి విమానమెక్కిన మహిళ.. బాత్రూమ్‌లల్లో కూర్చుని జర్నీ!


ఇక రోడ్డుపై వెళుతున్న ఇతర వాహనదారులు ఈ మొత్తం దృశ్యాన్ని చూసి షాకైపోయారు. ఈ సీన్ నమ్మశక్యంగా లేదనట్టు నోరెళ్లబెట్టారు. వారి ఆశ్చర్యం ముఖాల్లో కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇక వీడియోపై జనాల కామెంట్లకు అంతేలేకుండా పోయింది. అవసరం అన్నీ నేర్పిస్తుందని కొందరు అన్నారు. వీళ్ల క్రియేటివిటీకి హ్యాట్సాఫ్ చెప్పాలని కొందరు కామెంట్ చేశారు. ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యే వీడియోల్లో ఎప్పుడో ఏదోక కొత్తదనం ఉంటూనే ఉంటుందని కొందరు అన్నారు.

కాగా, ఇటీవల 8 మంది సభ్యులున్న ఓ కుటుంబం మొత్తం బైక్‌పై ప్రయాణించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. భార్య, భర్త వారి ఆరుగురు పిల్లలందరూ జాగ్రత్తగా బైక్‌పై కూర్చుని మిర్జాపూర్ ప్రాంతంలో వెళుతుండగా పోలీసులు వారిని చూసి ఆశ్చర్యపోయారు. ఆ జంట తమ వెంట కొన్ని సామాన్లను కూడా బైక్‌పై పెట్టి తరలించారు. అయితే, పోలీసులు వారిపై గయ్యిమన్నారు. ఇలా చేయడం ప్రమాదకరమని చివాట్లు పెట్టారు. ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకుని వీధుల్లోకి రావాలంటూ హితవు పలికి పంపించారు.

Elon Musk: భవిష్యత్తులో ఆ దేశం అంతరించిపోతుంది.. ఎలాన్ మస్క్ హెచ్చరిక

Google Tracking: మీ లొకేషన్‌ను గూగుల్ ట్రాక్ చేయొద్దని కోరుకుంటున్నారా? ఇలా చేస్తే సరి

Updated Date - Dec 06 , 2024 | 01:15 PM