Share News

Viral Video: ఈ టెక్నాలజీ చూసి టిమ్ కుక్ షాకవడం ఖాయం.. పగిలిపోయిన స్క్రీన్‌తో ఏం చేశాడో చూడండి..

ABN , Publish Date - Jun 07 , 2024 | 12:48 PM

శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలు అంటుంటారు. తెలివితేటలు ఉపయోగించి బయటపడగల నేర్పు ఉంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా ఇబ్బందేం ఉండదు. చాలా మంది సాధారణ వ్యక్తులు అలాగే తమ బుర్రలను వాడి సమస్యల నుంచి బయటపడుతుంటారు.

Viral Video: ఈ టెక్నాలజీ చూసి టిమ్ కుక్ షాకవడం ఖాయం.. పగిలిపోయిన స్క్రీన్‌తో ఏం చేశాడో చూడండి..
Broken Mobile

శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలు అంటుంటారు. తెలివితేటలు ఉపయోగించి బయటపడగల నేర్పు ఉంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా ఇబ్బందేం ఉండదు (Jugaad videos). చాలా మంది సాధారణ వ్యక్తులు అలాగే తమ బుర్రలను వాడి సమస్యల నుంచి బయటపడుతుంటారు. ముఖ్యంగా భారతీయులు (Indians) ఇలాంటి వాటిల్లో సిద్ధహస్తులని ఇటీవలి కాలంలో వైరల్ అవుతున్న చాలా వీడియోలు చాటి చెబుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే (Viral Video).


@Muskan_nnn అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ యువకుడు పగిలిపోయిన మొబైల్‌ను (Broken Mobile) పట్టుకుని ఉన్నాడు. ఆ మొబైల్ స్క్రీన్ మొత్తం పగిలిపోయి టచ్ పని చేయడం లేదు (Touch Screen). ఆ తర్వాత టైప్ సి కనెక్టర్ సహాయంతో మొబైల్‌కు చిన్న మౌస్‌ (Mouse)ను కనెక్ట్ చేశాడు. దాని సహాయంతో ఫోన్‌ను ఆపరేట్ చేయడం ప్రారంభించాడు. అంతకు ముందులాగనే ఫోన్ పని చేయడం ప్రారంభించింది. ఈ ట్రిక్ చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.


ఈ వీడియోకు ``ఇండియన్స్`` అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ వుతోంది. లఇప్పటివరకు ఈ వీడియోకు 7.1 లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. 12 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇండియ బిగినర్స్ కోసం కాదు``, ``భారతీయులు ఏమైనా చేయగలరు``, ``ఈ టెక్నాలజీ చూసి టిమ్ కుక్ కూడా ఆశ్చర్యపోతాడు``, ``ఇది హై లెవెల్ జుగాడ్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Anand Mahindra: ఫొటోకు ఫన్నీ క్యాప్షన్ అడిగిన ఆనంద్ మహీంద్రా.. విజేతకు ఏం గిఫ్ట్ ఇచ్చారంటే..!


Optical Illusion: ఈ ఫొటోలో విభిన్నమైన జంట ఏదో కనిపెడితే మీ కళ్లు నిజంగా పవర్‌ఫుల్ అని నమ్మవచ్చు..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 07 , 2024 | 12:48 PM