Share News

Werewolf Syndrome: తల్లి చేసిన తప్పుకి బాబుకి శాపం.. ప్రెగ్నెన్సీ టైంలో పిల్లి మాంసం తినడంతో..

ABN , Publish Date - Apr 18 , 2024 | 08:50 AM

మహిళలు గర్భం దాల్చిన తర్వాత ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అంటుంటారు. వాళ్లు తీసుకునే ఆహారంపై బిడ్డపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని, కాబట్టి పోషకాహారాలే తీసుకోవాలని చెప్తుంటారు. మరి.. ప్రెగ్నెన్సీ టైంలో తీసుకునే ఆహారాలు నిజంగానే బిడ్డపై ఎఫెక్ట్ చూపిస్తాయో...

Werewolf Syndrome: తల్లి చేసిన తప్పుకి బాబుకి శాపం.. ప్రెగ్నెన్సీ టైంలో పిల్లి మాంసం తినడంతో..
Mother Feared Son Werewolf Syndrome Condition Caused Eating Cat

మహిళలు గర్భం దాల్చిన తర్వాత ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అంటుంటారు. వాళ్లు తీసుకునే ఆహారంపై బిడ్డపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని, కాబట్టి పోషకాహారాలే తీసుకోవాలని చెప్తుంటారు. మరి.. ప్రెగ్నెన్సీ టైంలో తీసుకునే ఆహారాలు నిజంగానే బిడ్డపై ఎఫెక్ట్ చూపిస్తాయో లేదో తెలీదు కానీ, ఒక మహిళకు మాత్రం అనూహ్యమైన పరిస్థితి ఎదురైంది. తాను తిన్న పిల్లి మాంసం కారణంగానే.. తన కొడుకు ‘వేర్‌వోల్ఫ్ సిండ్రోమ్’తో (Werewolf Syndrome) పుట్టాడని ఆమె కన్నీరుమున్నీరు అవుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

‘హార్దిక్ పాండ్యా కన్నా అతడే బెటర్.. ఆ బ్యాటర్‌ని తీసుకోకపోతే తీవ్ర నిరాశే’


ఫిలిప్పీన్స్‌కు చెందిన అల్మా అనే మహిళకు జారెన్ గమోంగన్ అనే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే.. అతడు ముఖం, శరీరం కప్పి ఉంచేలా పెద్ద వెంట్రుకలతో జన్మించాడు. ఈ పరిస్థితిని ‘వేర్‌వోల్ఫ్ సిండ్రోమ్’గా పిలుస్తారు. ఇటువంటి కేసులు ప్రపంచవ్యాప్తంగా 50 నుంచి 100 వరకు ఉన్నాయి కానీ.. అల్మా మాత్రం తాను చేసిన తప్పు కారణంగానే తన తనయుడికి శాపం తగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. జారెన్ కడుపులో ఉన్న సమయంలో తాను నల్లిపిల్లిని తెచ్చుకొని వండుకొని తిన్నానని.. ఆ కారణంగానే తన కొడుకు ఇలా పుట్టాడని చెప్తోంది. గ్రామస్తులు సైతం ఆ మాటే చెప్పడం వల్లే.. పిల్లి తినడం వల్లే ఇలా జరిగిందని అల్మా నమ్మడం మొదలుపెట్టింది. అయితే.. అందుకు సరైన ఆధారాలు మాత్రం లేవు.

జపాన్ బుల్లెట్ ట్రైన్‌లో అరుదైన ఘటన.. పాము చేసిన రచ్చ కారణంగా..

తన కొడుకు ఎలుగుబంటి తరహాలో ఒళ్లంతా జుట్టుతో పుట్టడం చూసి ఖంగుతిన్న అల్మా.. ఈ సమస్యకి పరిష్కారం కోసం ఎంతోమంది వైద్యుల్ని సంప్రదించింది. అయితే.. ఇందుకు చికిత్స లేదని వైద్యులు చేతులెత్తేశారు. జారెన్‌కు అనేక వైద్య పరీక్షలు చేశాక.. అతను హైపర్‌ట్రికోసిస్ (సాధారణంగా ఉండే జుట్టు కన్నా ఎక్కువగా పెరగడం) అనే అరుదైన వైద్య పరిస్థితితో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. తాను కూడా చాలాసార్లు జుట్టు కత్తిరించేందుకు ప్రయత్నించానని, అయితే కత్తిరించిన కొద్ది జుట్టు మరింత దట్టంగా పెరుగుతోందని అల్మా చెప్పుకొచ్చింది. ఇప్పటికీ పట్టువదలని అల్మా దంపతులు.. కుమారుడి హెయిర్ రిమూవల్ సెషన్‌లకు నిధులు సమకూర్చే పనిలో నిమగ్నమయ్యారు.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 18 , 2024 | 08:50 AM