Share News

Gender Change: లింగ మార్పిడి వయస్సు మరింత తగ్గింపు..కీలక చట్టానికి ఆమోదం

ABN , Publish Date - Apr 17 , 2024 | 09:15 PM

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో లింగ బేధాలు క్రమంగా మారుతున్న సందర్భాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విభేదాలను పక్కనపెట్టి వాటిని సమ్మతించేందుకే మొగ్గుచూపుతున్నారు. దీంతో తాజాగా ఐరోపాలోని ప్రముఖ దేశం స్వీడన్(Sweden) చట్టపరమైన లింగ మార్పిడి వయస్సును(age) 18 ఏళ్ల నుంచి 16 సంవత్సరాలకు తగ్గించింది.

Gender Change: లింగ మార్పిడి వయస్సు మరింత తగ్గింపు..కీలక చట్టానికి ఆమోదం
Swedish Parliament

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో లింగ బేధాలు క్రమంగా మారుతున్న సందర్భాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే విభేదాలను పక్కనపెట్టి వాటిని సమ్మతించేందుకే మొగ్గుచూపుతున్నారు. దీంతో తాజాగా ఐరోపాలోని ప్రముఖ దేశం స్వీడన్(Sweden) చట్టపరమైన లింగ మార్పిడి వయస్సును(age) 18 ఏళ్ల నుంచి 16 సంవత్సరాలకు తగ్గించింది. ఇందుకు సంబంధించిన చట్టాన్ని స్వీడన్ పార్లమెంట్(Swedish Parliament) బుధవారం ఆమోదించింది.

ఈ చట్టంపై బుధవారం స్వీడిష్ పార్లమెంట్‌లో ఓటింగ్(voting) జరిగింది. అందులో 234 మంది ఎంపీలు చట్టానికి అనుకూలంగా ఓటు వేయగా, 94 మంది ఎంపీలు వ్యతిరేకించారు. 21 మంది ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అదే సమయంలో కొంతమంది క్రిస్టియన్ డెమోక్రాట్లు దీనిని వ్యతిరేకించారు. స్వీడన్ మితవాద పార్టీగా పరిగణించబడే స్వీడన్ డెమొక్రాట్లు కూడా చట్టానికి నో అన్నారు. ఈ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తోంది, కానీ ప్రభుత్వంలో భాగంగా లేదు.


కానీ 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యువత లింగ మార్పు(gender change) ప్రక్రియను ప్రారంభించే ముందు వారి కుటుంబ సభ్యులు, డాక్టర్, నేషనల్ బోర్డ్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ నుంచి తప్పనిసరిగా ఆమోదం తీసుకోవాలి. అయితే లింగ మార్పిడి సమ్మతి వయస్సును 18 నుంచి 16 సంవత్సరాలకు తగ్గించాలని సిఫార్సు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇలా చేయడం వల్ల లైంగిక సంబంధాల విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఇలాంటి చట్టాలను ఆమోదించే క్రమంలో టీనేజర్ల ఆరోగ్య అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.


ఇది కూడా చూడండి:

Pakistan: తాత్కాలికంగా ఎక్స్ నిలిపివేత

UAE: ఎడారి నేలలో జలప్రళయం.. భీకర వర్షాలతో వణుకుతున్న దుబాయి


మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 17 , 2024 | 09:19 PM