Share News

Viral Video: సర్‌ప్రైజింగ్ వీడియో.. హంస తన పిల్లల కోసం ఎలాంటి ఇల్లు కట్టిందో చూడండి..!

ABN , Publish Date - Aug 03 , 2024 | 09:03 PM

ఈ ప్రకృతిలోనే అందమైన జీవిగా హంసను చెప్పుకుంటాం. హంసను చూడడమే గొప్ప అదృష్టమని కొన్ని దేశాలలో భావిస్తుంటారు. నిజానికి హంసలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటి హంసకు చెందిన ఓ అద్భుతమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: సర్‌ప్రైజింగ్ వీడియో.. హంస తన పిల్లల కోసం ఎలాంటి ఇల్లు కట్టిందో చూడండి..!
swan

ఈ ప్రకృతిలోనే అందమైన జీవిగా హంస (Swan)ను చెప్పుకుంటాం. హంసను చూడడమే గొప్ప అదృష్టమని కొన్ని దేశాలలో భావిస్తుంటారు. నిజానికి హంసలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటి హంసకు చెందిన ఓ అద్భుతమైన వీడియో (Swan Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హంస తన పిల్లల సంరక్షణ చేసిన ఏర్పాటు ఎంతో మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ వీడియోలోని హంస తల్లి మనసు చూసి చాలా మంది చలించిపోతున్నారు. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).


uzay.bilim.teknoloji అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ హంస నీటిపై ప్రయాణిస్తోంది. ఆ హంసతోపాటు దాని పిల్లలు కూడా ఉన్నాయి. తన పిల్లలను సురక్షితంగా ఉంచడం కోసం ఆ హంస తన రెక్కలు విప్పి అద్భుతమైన ఇంటిని నిర్మించింది. తన రెక్కల కింద వాటిని కూర్చోబెట్టింది. ఆ పిల్లలు ఇంట్లో కూర్చున్నట్టు హాయిగా కూర్చుని నీటిపై ప్రయాణిస్తున్నాయి. ఈ అద్భుతమైన దృశ్యాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది.


ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు రెండు కోట్ల మందికి పైగా వీక్షించారు. దాదాపు 36 లక్షల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అత్యంత విలువైన వీడియో``, ``ఇంతకంటే అందంగా ఏమి ఉంటుంది``, ``ఆ పిల్లలు స్వర్గంలో ఉన్నాయి``, ``ఇది హంసకు మాత్రమే సాధ్యమైనది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Viral: వామ్మో.. ఐదు నిమిషాల పార్కింగ్.. రూ.11 లక్షల జరిమానా.. ఓ మహిళకు ఎదురైన షాకింగ్ అనుభవం ఏంటంటే..


Viral Video: తమ్ముడూ.. ఇలా అయితే వధువు పారిపోతుందేమో.. పెళ్లిలో వరుడి తుఫాన్ డ్యాన్స్ చూడండి..!


Picture Puzzle: మీవి హెచ్‌డీ కళ్లు అయితే.. ఈ ఫొటోలో తేడాగా ఉన్న డబ్బుల సంచిని 10 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral Video: ఐదు సింహాలు చుట్టుముడితే ఎలా ఉంటుంది.. ఓ హిప్పో ఏం చేసిందో చూడండి..!


Optical Illusion: ఈ ఫొటోలోని ``story``ని కనిపెట్టండి.. 10 సెకెన్లలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయండి..!

Viral Video: వామ్మో.. ఇలా కూడా బస్సు నడుపుతారా? డ్రైవర్‌కు కండక్టర్ చేస్తున్న సహాయం చూస్తే షాకవ్వాల్సిందే..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Aug 03 , 2024 | 09:03 PM