Share News

Viral: లివర్‌ను దానం చేసేందుకు మైనర్ బాలికకు కోర్టు అనుమతి! ఎందుకంటే..

ABN , Publish Date - Jun 27 , 2024 | 09:59 PM

తీవ్రమైన కాలేయ వ్యాధితో బాధపడుతున్న తండ్రికి అవయవ దానం చేసేందుకు ఓ మైనర్ బాలికకు మధ్యప్రదేశ్ హైకోర్టు అనుమతించింది. రోగికి తక్షణం అవయవ మార్పిడి శస్త్రచికిత్స చేయాలని ఆదేశించింది.

Viral: లివర్‌ను దానం చేసేందుకు మైనర్ బాలికకు కోర్టు అనుమతి! ఎందుకంటే..

ఇంటర్నెట్ డెస్క్: తీవ్రమైన కాలేయ వ్యాధితో బాధపడుతున్న తండ్రికి అవయవ దానం చేసేందుకు ఓ మైనర్ బాలికకు మధ్యప్రదేశ్ హైకోర్టు అనుమతించింది. రోగికి తక్షణం అవయవ మార్పిడి శస్త్రచికిత్స చేయాల్సి రావడంతో మానవతా కోణంలో కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. తండ్రికి అండగా నిలిచిన బాలికపై ప్రశంసలు కురుస్తున్నాయి (Viral).

రూరల్ ఇండోర్‌కు చెందిన శివనారాయణ్ బాథమ్ (42) వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. గత ఆరేళ్లుగా ఆయన తీవ్రమైన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. అవయవ మార్పిడి జరగకపోతే ప్రాణానికే ప్రమాదం. బాథమ్‌కు ఐదుగురు ఆడపిల్లలున్నారు. పెద్ద కుమార్తెకు వచ్చే నెల 31కి 18 ఏళ్లు నిండుతాయి. ఇక బాథమ్ తండ్రికి 80 ఏళ్లు కాగా, తల్లి కూడా షుగర్ వ్యాధితో బాధపడుతోంది (MP High Court permits 17-year-old to donate liver to ailing father).

Viral: నిత్యం కారు నడిపే వ్యక్తి.. ఐదేళ్లుగా హారన్‌యే కొట్టలేదు! ఎందుకంటే..


ఈ నేపథ్యంలో బాథమ్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు కాలేయం దానం చేసేందుకు పెద్ద కుమార్తె ప్రీతి సంసిద్ధంగా ఉందని తెలిపారు. తన ప్రాణాలు నిలవాలంటే శస్త్రచికిత్స తప్పనిసరి అని వేడుకున్నారు. మరోవైపు, పరిస్థితిని సమీక్షించేందుకు ఏర్పాటైన మెడికల్ బోర్డు కూడా ప్రీతి అవయవదానానికి తగిన డోనర్ అని నిర్ణయించింది. ఈ మెడికల్ రిపోర్టును ప్రభుత్వం కోర్టు ముందుంచింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం వీలైనంత త్వరగా రోగికి ఆపరేషన్ పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన కూతురిని చూసి బాథమ్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు.

Read Viral and Telugu News

Updated Date - Jun 27 , 2024 | 10:04 PM