Share News

Viral: లేటుగా వచ్చే ఉద్యోగుల కోసం కొత్త రూల్.. సంస్థ సీఈఓకు ఊహించని షాక్!

ABN , Publish Date - Jun 20 , 2024 | 07:58 PM

కార్యాలయాలకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగులకు క్రమశిక్షణ నేర్పించేందుకు సంస్థ సీఈఓ పెట్టిన ఓ కొత్త రూల్ ఊహించని విధంగా బ్యాక్‌ఫైర్ అయ్యింది.

Viral: లేటుగా వచ్చే ఉద్యోగుల కోసం కొత్త రూల్..  సంస్థ సీఈఓకు ఊహించని షాక్!

ఇంటర్నెట్ డెస్క్: కార్యాలయాలకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగులకు క్రమశిక్షణ నేర్పించేందుకు సంస్థ సీఈఓ పెట్టిన ఓ కొత్త రూల్ ఊహించని విధంగా బ్యాక్‌ఫైర్ అయ్యింది. అసలేం జరిగిందో చెబుతూ సంస్థ సీఈఓ స్వయంగా పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ (Viral) అవుతోంది.

కౌశల్ షా అనే వ్యక్తి ముంబైలో ఎవర్ బ్యూటీ అనే బ్యూటీ బ్రాండ్‌ను నిర్వహిస్తుంటారు. అయితే, కార్యాలయానికి ఆలస్యంగా వచ్చే ఉద్యోగులు క్రమశిక్షణ పాటించేందుకు ఆయన ఓ కొత్త రూల్ విధించారు. దీని ప్రకారం, ఆఫీసుకు లేటుగా వచ్చిన ఉద్యోగి రూ.200 జరిమానా చెల్లించాలి. టీం కోసం కేటాయించిన నిధికి ఈ మొత్తం బదిలీ అవుతుంది. అంతిమంగా, టీం సభ్యుల కోసమే ఈ మొత్తం ఖర్చు చేసేలా ఆయన ప్లాన్ చేశారు (Mumbai CEOs punctuality rule backfires as he pays Rs 1000 fine himself).

Viral: సర్‌‌ప్రైజ్ చేద్దామని వెళ్లిన కొడుకు చెంప ఛెళ్లుమనిపించిన తండ్రి.. షాకింగ్ వీడియో


అయితే, ఉద్యోగుల్లో క్రమశిక్షణ కోసం ఆయన ఏర్పాటు చేసిన వ్యవస్థ ఊహించని విధంగా బ్యాక్ ఫైర్ అయ్యింది. కేవలం రోజుల వ్యవధిలోనే సీఈఓ కౌశల్ షా ఐదు సార్లు ఆలస్యంగా ఆఫీసుకు రావడంతో రూ.1000 జరిమానా కింద చెల్లించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని కౌశల్ స్వయంగా నెట్టింట పంచుకున్నారు. ఉద్యోగుల ఉత్పాదకత పెంచేందుకు పెట్టిన రూల్ చివరకు ఇలా అనూహ్య ఫలితాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చారు.

అయితే, నిబంధనలనేవి కార్మికుడి నుంచి యజమాని వరకూ అందరికీ వర్తిస్తాయని, కాబట్టి ఉద్యోగులు రూల్స్ ఫాలోకావాలంటే ముందుగా సంస్థ నిర్వాహకులు కూడా ఆ రూల్స్ పక్కాగా పాటించాలని చెప్పుకొచ్చారు. కౌశల్ నిబద్ధత పట్ల కొందరు హర్షం వ్యక్తం చేస్తుంటే మరికొందరు మాత్రం ఈ ఉదంతం ఫన్నీగా ఉందని కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Read Viral and Telugu News

Updated Date - Jun 20 , 2024 | 08:01 PM