నా క్రికెట్ ఫేవరెట్...
ABN , Publish Date - Nov 03 , 2024 | 06:41 AM
సినిమా, క్రికెట్‌లది విడదీయరాని బంధం. ఇద్దరూ స్టార్లే... అయితే తమ అభినయంతో ఎంతోమంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టే అందాలభామలు క్రికెట్ స్టార్లకు వీరాభిమానులు. అందుకే క్రికెట్ స్టేడియంలో అప్పుడప్పుడు మెరుస్తుంటారు. ఇంతకీ ఎవరి ఫేవరెట్ స్టార్ ఎవరు? వారి మాటల్లోనే...
సినిమా, క్రికెట్‌లది విడదీయరాని బంధం. ఇద్దరూ స్టార్లే... అయితే తమ అభినయంతో ఎంతోమంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టే అందాలభామలు క్రికెట్ స్టార్లకు వీరాభిమానులు. అందుకే క్రికెట్ స్టేడియంలో అప్పుడప్పుడు మెరుస్తుంటారు. ఇంతకీ ఎవరి ఫేవరెట్ స్టార్ ఎవరు? వారి మాటల్లోనే...
ఫ్యామిలీ మ్యాన్
మహేంద్ర సింగ్ ధోనికి నేను వీరాభిమానిని. ధోని బ్యాటింగ్, వికెట్ కీపింగ్ అంటే పడిచచ్చిపోతా. ధోని అద్భుతమైన ఆటగాడే కాదు... అంతకన్నా మంచి మనసున్న వ్యక్తి. ఆయన్ని చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తిని నేను. ఫ్యామిలీమ్యాన్‌కు సరైన ఉదాహరణ ధోనీనే. ఆయన తన కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత చూస్తే ముచ్చటేస్తుంది. నిజ జీవితంలో కూడా ఆయన మిస్టర్ కూల్. నా అభిమాన క్రికెటర్ బయోపిక్ (ఎమ్‌ఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ)లో నేనూ భాగం కావడం నా అదృష్టంగానే భావిస్తుంటా.
- కియారా అద్వానీ
ఒకప్పుడు రోహిత్ నా క్రష్
హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మపై ఒకప్పుడు క్రష్ ఉండేది. రోహిత్‌లోని నాయకత్వ లక్షణాలు, ఆటతీరు నన్ను బాగా ఆకట్టుకుంటాయి. అతను బ్యాటింగ్ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. బరిలోకి దిగితే డబుల్ సెంచరీ కొట్టందే ఫీల్డ్ బయటకు రాని అతడి తెగువ గొప్పది. రోహిత్ ఆడే మ్యాచ్‌లను మిస్ అవ్వకుండా చూస్తుంటా. మా ఇంట్లో అందరం రోహిత్ అభిమానులమే.
- కాజల్ అగర్వాల్
ఆయనో మాస్టర్ పీస్
నా ఆల్‌టైం ఫేవరెట్ క్రికెటర్ వన్ అండ్ ఓన్లీ రాహుల్ ద్రవిడ్. నేను ఆయనకు ఎంత పెద్ద ఫ్యానో మాటల్లో చెప్పలేను. ఆయన కూల్ అండ్ క్లాసిక్ ప్లేయర్. చిరాకు పడడం, కోప్పడటం నేను ఎప్పుడూ చూడలేదు. నా దృష్టిలో ఆయనో జెంటిల్‌మెన్. ఈతరంలో ఎంతమంది గొప్ప ఆటగాళ్లు ఉన్నా... ద్రవిడ్‌కు సాటిరారు. ఆయనో మాస్టర్ పీస్ అంతే.
- పూజా హెగ్డే
మంచి స్నేహితులం...
నా ఫేవరెట్ క్రికెటర్ ఎవరో కాదు.. నా స్నేహితుడు కేఎల్ రాహుల్. మేమిద్దరం బెంగుళూరుకు చెందినవాళ్లమే. ఎన్నో ఏళ్లుగా మేమిద్దం ఒకరికొకరం బాగా తెలుసు. రాహుల్ క్రికెటర్ అవ్వకముందు, నేను నటిని కాకముందు నుంచే మాకు పరిచయం ఉంది. అప్పట్లో ఇద్దరం కలిసి తిరిగేవాళ్లం. ఎక్కువగా రెస్టారెంట్స్‌కు వెళ్లి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని లాగించేవాళ్లం. ఆ తర్వాత మా వృత్తుల్లో బిజీ అయిపోయాం. వీలు చిక్కినప్పుడల్లా మెసేజ్‌లు చేసుకుంటూ ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నాం.
- నిధి అగర్వాల్