Dhoni-Trump: గోల్ఫ్ ఆడుతున్న ట్రంప్-ఎంఎస్ ధోనీ.. ఫొటోలు, వీడియోలు వైరల్
ABN , Publish Date - Nov 07 , 2024 | 07:53 AM
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉండగా ఏకంగా 295 సాధించారు. ఈ గెలుపుతో ట్రంప్ అరుదైన రికార్డు సాధించారు. అయితే ఒక్కసారిగా ఎంఎస్ ధోనీ-ట్రంప్ ఫొటోలు ఎందుకు వైరల్‌గా మారాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉండగా ఏకంగా 295 సాధించి చిరస్మరణీయ విజయం అందుకున్నారు. ఈ గెలుపుతో ట్రంప్ అరుదైన రికార్డు కూడా సాధించారు. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసి, తదుపరి ఎన్నికల్లో ఓడిపోయి అనంతరం మరో పర్యాయం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇలా జరగడ 131 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. దీంతో ట్రంప్‌తో పాటు ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలావుంచితే... అమెరికా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో.. భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ కలిసి గోల్ఫ్ ఆడుతున్న ఫొటోలు, వీడియోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
డొనాల్డ్ ట్రంప్ గెలుపునకు, మహేంద్ర సింగ్ ధోనీకి ఎలాంటి కనెక్షన్ లేకపోయినప్పటికీ నెటిజన్లు సరదాగా ఈ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు. అధ్యక్షుడిగా ట్రంప్ రీఎంట్రీ ఇవ్వబోతుండడంతో ఆయనతో ధోనీ గడిపిన సందర్భాన్ని ఫన్నీ ఎమోజీలతో పంచుకుంటున్నారు. భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన ఎంఎస్ ధోనీ 2023లో ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడాడని ఫ్యాన్స్ గుర్తుచేస్తున్నారు. పాపులర్ అయిన ‘థాలా ఫర్ ఏ రీజన్’ క్యాప్షన్‌తో ఈ ఫొటోలను వైరల్‌గా మార్చారు.
ఈ వీడియోలు, ఫొటోలపై పలువురు నెటిజన్లు సరదా కామెంట్లు చేశారు. ‘‘America = 7 అక్షరాలు (ధోనీ జర్సీ నంబర్). అందుకే ‘థాలా ఫర్ ఏ రీజన్’. మా ధోనీ సరదాగా యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్‌తో గోల్ఫ్ ఆడతాడు’’ అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. కాగా 2023లో గోల్ఫ్ ఆడేందుకు ధోనీని ట్రంప్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ సమయంలో వీరిద్దరూ కలిసి గోల్ఫ్ ఆడారు.
అమెరికా ఎన్నికలను ధోనీతో మరో కోణంలో కూడా ఫ్యాన్స్ ముడిపెట్టారు. ట్రంప్ ప్రత్యర్థి కమలా హారిస్ భారతీయ-అమెరికన్ సంతతికి చెందిన వ్యక్తి అనే విషయం తెలిసిందే. ఆమె పూర్వీకులు తమిళనాడులోని మద్రాస్‌కు (ప్రస్తుతం చెన్నై) చెందినవారు. ఇక ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తరఫున ధోనీ ఆడుతున్నాడని సరదాగా అమెరికా ఎన్నికలతో ధోనీని ముడిపెడుతున్నారు. కాగా ఎంఎస్ ధోనీ 2019లో అంతర్జాతీయ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్‌లో మిస్టర్ కూల్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
ఓటమిపై స్పందించిన కమలా హారిస్.. ఆసక్తికర వ్యాఖ్యలు
మీ భార్య డెలివరీకి ఇంటి దగ్గర ఉండాల్సి వస్తే.. గవాస్కర్‌కి ఆసీస్ మాజీ క్రికెటర్ కౌంటర్
వాట్సప్‌లో ఇలాంటి కంటెంట్ షేర్ చేస్తే చిక్కులు కొని తెచ్చుకున్నట్టే
విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయబోయిన వ్యక్తి.. ఆ తర్వాత జరిగిందిదే