Share News

Viral Video: బ్రెయిన్ వాడితే స్ట్రెయిన్ తగ్గుతుంది.. ఈ మహిళలు వాడుతున్న టెక్నిక్‌లు చూస్తే మతి పోగొట్టుకోవాల్సిందే..

ABN , Publish Date - Jul 09 , 2024 | 12:42 PM

బ్రెయిన్ యూజ్ చేస్తే.. స్ట్రెయిన్ తగ్గుతుంది.. ఇది కేవలం సినిమాలో డైలాగ్ మాత్రమే కాదు.. వాస్తవం కూడా. కొద్దిగా బుర్రకు పదును పెడితే శ్రమ లేకుండా చాలా సులభంగా కొన్ని పనులను చేసుకోవచ్చు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Viral Video: బ్రెయిన్ వాడితే స్ట్రెయిన్ తగ్గుతుంది.. ఈ మహిళలు వాడుతున్న టెక్నిక్‌లు చూస్తే మతి పోగొట్టుకోవాల్సిందే..
New technique to squeeze clothes

బ్రెయిన్ యూజ్ చేస్తే.. స్ట్రెయిన్ తగ్గుతుంది.. ఇది కేవలం సినిమాలో డైలాగ్ మాత్రమే కాదు.. వాస్తవం కూడా. కొద్దిగా బుర్రకు పదును పెడితే శ్రమ లేకుండా చాలా సులభంగా కొన్ని పనులను చేసుకోవచ్చు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు (Jugaad Videos) సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎంతో మంది సాధారణ వ్యక్తులు, గృహిణులు తమ తెలివితేటలతో కష్టమైన పనులను సులభంగా చేసుకోవడం చూశాం. తాజాగా ఓ మహిళ బట్టల (Clothes) నుంచి నీటిని పిండేందుకు (Dry) అద్భుతమైన టెక్నిక్‌ను ఉపయోగించింది (Viral Video).


kirtianimeshviralreels అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ప్లాస్టిక్ బుట్టకు ఓ వస్త్రం కట్టి, దానిని తాడుకు కట్టారు. ఆ వస్త్రాన్ని వీలైనన్ని చుట్టలు చుట్టారు. అనంతరం ఆ ప్లాస్టిక్ బుట్టలో తడి బట్టలను వేసి వదిలింది. ఆ వస్త్రం సాధారణ స్థితికి వచ్చే వరకు ఆ బుట్ట తిరుగుతూనే ఉంటుంది. లోపల నుంచి తడి బట్టల నుంచి నీరు బయటకు వచ్చేస్తోంది. సాధారణంగా వాషింగ్ మెషిన్‌లో డ్రయర్ కూడా ఇలాగే పని చేస్తుంది. ఆ టెక్నిక్‌నే ఇక్కడ మహిళ కూడా ఉపయోగించింది. ఇటీవల ఓ మహిళ ఇటుకలతో వాషింగ్‌మెషిన్‌ను నిర్మించి అంతా అవాక్కయ్యేలా చేసింది.


ఈ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఈ వైరల్ వీడియోకు ఇప్పటివరకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. 3.5 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది కరెంట్ అవసరం లేని డ్రయర్``, ``ఏమి తెలివితేటలు``, ``ఈమెకు ఏదో ఒక అవార్డు ఇవ్వాలి``, ``మంచి టెక్నిక్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion: ఈ ఫొటోలో ఉన్న చేపను 5 సెకెన్లలో కనిపెడితే మీవి హెచ్‌డీ కళ్లు అని నమ్మవచ్చు..!


Viral Video: ఈ వ్యక్తిని చూసి నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు.. బైక్‌తో సహా వరదలో చిక్కుకున్నా అతడేం చేస్తున్నాడో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోస క్లిక్ చేయండి..

Updated Date - Jul 09 , 2024 | 02:30 PM