Trending News: ఈ దేశంలో అసలు నేరాలే జరగవట.. ఆయుధాలు ఉన్నా ఉపయోగించరట.. !
ABN , Publish Date - Mar 31 , 2024 | 11:56 AM
అవినీతి, నేరాలు కేవలం ఒక్క దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచమంతా ఇదే పరిస్థితి ఉంది. దేశ అభివృద్ధికి ఇవి ప్రధాన అవరోధాలుగా నిలుస్తున్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా అక్రమార్కులకు అడ్డుకట్ట పడటం లేదు.
అవినీతి, నేరాలు కేవలం ఒక్క దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచమంతా ఇదే పరిస్థితి ఉంది. దేశ అభివృద్ధికి ఇవి ప్రధాన అవరోధాలుగా నిలుస్తున్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా అక్రమార్కులకు అడ్డుకట్ట పడటం లేదు. అయితే అసలు నేరమే లేని దేశం గురించి మీకు తెలుసా. అంతే కాదండోయ్ అక్కడ పోలీసులు కూడా ఆయుధాలు ఉపయోగించరట. ఐస్‌లాండ్ ( Iceland ) లో ఈ ఏడాది క్రైమ్ రేట్ చాలా తక్కువగా ఉందని అధికారులు తెలిపారు. పోలీసుల దగ్గర ఆయుధాలు ఉన్నప్పటికీ వారు వాటిని ఉపయోగించక చాలా రోజులు గడిచాయని వెల్లడించారు. ఈ దేశంలోని ప్రతి ముగ్గురు పౌరులలో ఒకరికి ఆయుధం ఉంటుంది. కానీ ఏడాదిలో ఒకటి రెండు హత్యలు వంటివి సైతం జరగకపోవడం విశేషం.
Himachal Pradesh: మండు వేసవిలో హిమపాతం.. మంచు దుప్పటి కప్పుకున్న హిమాలయ రాష్ట్రాలు..
నేరాలు లేకపోవడంతో తల్లిదండ్రులు వారి పిల్లలను బయట స్వేచ్ఛగా వదిలేస్తారు. వారికి ఎలాంటి భయం ఉండదు. నేరాల తగ్గింపునకు సమానత్వం అత్యంత ముఖ్యమైన కారణంగా భావిస్తున్నారు. నువ్వు ఎక్కువ, నేను తక్కువ అనే భేదాలు లేవు. డబ్బుకు అంతగా విలువనివ్వరు. పారిశ్రామికవేత్తల పిల్లలు కూడా సాధారణ పిల్లల మాదిరిగానే పాఠశాలకు వెళతారు. కళాశాల డిగ్రీ ఒక నెల అద్దె కంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ప్రతి పౌరుడికి ఉద్యోగం లభించడంతో నేరాలు తగ్గుముఖం పట్టాయి.
ఐస్‌లాండ్ అగ్నిపర్వతాలకు ప్రసిద్ధి. ఇక్కడ మూడు లక్షలకు పైగా జనాభా ఉంది. ఆరోగ్యం, విద్య రంగాల్లో మహిళలు పని చేస్తున్నారు. ఈ కారణంతోనే ఐస్‌లాండ్ ను 'ఫెమినిస్ట్ హెవెన్' లేదా మహిళలకు స్వర్గధామం అని పిలుస్తారు. కాగా.. అక్టోబర్ 2023లో ప్రధాన మంత్రి కాట్రిన్ ఇతర మహిళలతో కలిసి ఒకరోజు సమ్మె చేశారు. వేతన అసమానతలు, లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా మహిళలు నిరసనలు చేయడం గమనార్హం.
మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.