Viral: గర్ల్‌ఫ్రెండ్ నిజస్వరూపం తెలిసి ఆగ్రహం.. పెళ్లి రోజున ప్రతీకారం
ABN , Publish Date - Jun 11 , 2024 | 08:32 PM
వధువు ఎఫైర్ గురించి తెలుసుకున్న వరుడు సరిగ్గా పెళ్లి రోజున బంధువులు, స్నేహితుల మందు ఆమె బండారం బయటపెట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: వైవాహిక బంధానికి నమ్మకమే పునాది. ఆ నమ్మకం వమ్మైన రోజు మనసులు కోలుకోలేని విధంగా గాయపడతాయి. ఇవి చివరకు అనూహ్య పరిణామాలకు దారి తీస్తాయి. చైనాలో సరిగ్గా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఇది 2019లో జరిగినా సోషల్ మీడియా పుణ్యమా అని మళ్లీ వైరల్ (Viral) అవుతోంది. జనాలు ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.
తన గర్ల్‌ఫ్రెండ్ నిజస్వరూపం తెలుసుకున్న ఓ వ్యక్తి ఆగ్రహంతో రగిలిపోయాడు. పక్కాగా ప్లాన్ చేసి సరిగ్గా పెళ్లి రోజునే రివెంజ్ తీర్చుకున్నాడు. బంధువులు స్నేహితుల ముందు ఆమె పరువు తీసేశాడు. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, వరుడు పెళ్లి అయ్యే వరకూ ఎవరికీ అనుమానం రాకుండా నటించాడు. మరోవైపు, పెళ్లి వేడుక పక్కనే ఓ స్క్రీన్ ఏర్పాటు చేసి ఆ జంటకు సంబంధించిన పాత వీడియోలు ఒక్కొక్కటిగా ప్లే చేస్తున్నారు.
Viral: మనసు మాట విని ఏకంగా రూ.20 కోట్లు కొల్లగొట్టాడు! ఎలాగో తెలిస్తే..
సరిగ్గా వారి పెళ్లి జరగ్గానే స్క్రీన్ పై షాకింగ్ వీడియో మొదలైంది. అది వధువు ఎఫైర్‌కు సంబంధించిన వీడియో. ఆమె తన బావతో సన్నిహితంగా ఉన్న క్షణాలకు సంబంధించిన వీడియో. స్క్రీన్ పై ఆ దృశ్యం కనబడగానే వధువు ఒక్కసారిగా తెల్లముఖం వేసింది. తన బండారం బయటపడింనందుకు ఆమె ముఖం చిన్నబోయింది. ఈ సీన్స్ చూసి పెళ్లికొచ్చిన వారందరూ షాకైపోయారు. సరిగ్గా ఆ టైంలో వధువును చూస్త మండిపడ్డ వరుడు నాకేమీ తెలీదని అనుకుంటున్నావా? మోసం చేద్దామనుకుంటున్నావా? అంటూ మండిపడ్డాడు. దీంతో, వధువు తన చేతిలో ఉన్న బొకేను అతడిపై విసిరికొట్టింది (On Wedding Day Groom Exposes Brides Affair In Front Of Guests ).
అంతకుముందు, వరుడు తమ ఇంట్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. దాని పనితీరును చెక్ చేసేందుకు కొన్ని చోట్ల వాటిని ఫిట్ చేశాడు. ఈ క్రమంలో యువతి ఎఫైర్ కెమెరాలో రికార్డైంది. కెమెరా ఫుటేజీ చెక్ చేస్తుండగా అది తన కంట పడటంతో ఆగ్రహంతో ఊగిపోయిన బాయ్‌ఫ్రెండ్ పక్కాగా ప్లాన్ చేసి పెళ్లి రోజున అందరి ముందూ ఆమె బండారం బయటపెట్టాడు. అయితే, ఈ వీడియోపై నెట్టింట భిన్నాభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి.