Onion Shampoo: ఈ 4 మార్గాలలో ఇంట్లోనే ఉల్లిపాయ షాంపూ తయారుచేసుకుని వాడండి.. జుట్టు ఎంత బాగా పెరుగుతుందంటే..!
ABN , Publish Date - Jul 17 , 2024 | 12:23 PM
ఉల్లిపాయలు ఈ మధ్య కాలంలో జుట్టు సంరక్షణలో చాలా విరివిగా ఉపయోగిస్తున్నారు. ఉల్లిపాయ నూనె, ఉల్లిపాయ రసం వినియోగించడం చూసే ఉంటారు. కొన్ని వాణిజ్య ఉత్పత్తులు కూడా ఉల్లిపాయ నూనె, ఉల్లిపాయ సారాన్ని జోడించి తయారుచేసిన షాంపూలను విక్రయిస్తున్నాయి. అయితే..
ఉల్లిపాయలు ఈ మధ్య కాలంలో జుట్టు సంరక్షణలో చాలా విరివిగా ఉపయోగిస్తున్నారు. ఉల్లిపాయ నూనె, ఉల్లిపాయ రసం వినియోగించడం చూసే ఉంటారు. కొన్ని వాణిజ్య ఉత్పత్తులు కూడా ఉల్లిపాయ నూనె, ఉల్లిపాయ సారాన్ని జోడించి తయారుచేసిన షాంపూలను విక్రయిస్తున్నాయి. అయితే వీటిలో ఎంతో కొంత రసాయనాలు ఉండనే ఉంటాయి. అందుకే ఇంట్లోనే సహజంగా ఉల్లిపాయ షాంపూను తయారుచేసుకుని వాడితే జుట్టు పెరుగుదలకు అడ్డే ఉండదు. నల్లగా, ఒత్తుగా, పొడవుగా జుట్టు పెరగాలంటే ఉల్లిపాయ షాంపూను ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుంటే..
Viral: వావ్.. మన సీతాకోకచిలుక హీరోయిన్ తెలివి అమోఘం.. ఒక్క చుక్క నూనె చిందకుండా ప్యాకెట్ నుండి నూనెను ఎలా పోసారో చూడండి..!
ఉల్లిపాయ షాంపూ..
100గ్రాముల ఉల్లిపాయలు తీసుకోవాలి. ఈ ఉల్లిపాయలను తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరిగిన ఉల్లిపాయలను మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. దీన్ని నూలు వస్త్రం లేదా ఫిల్టర్ సహాయంతో రసాన్ని తీయాలి. దీంట్లో కొబ్బరినూనె, ఆముదం, నీలగిరి తైలం, రెగ్యులర్ గా ఉపయోగించే షాంపూ వేసి బాగా కలపాలి. దీన్ని జుట్టుకు పట్టించి ఆ తరువాత జుట్టును వాష్ చేసుకోవాలి.
కేవలం పై పద్ధతిలోనే కాకుండా మరికొన్ని పద్దతులలో కూడా ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు ఉపయోగించవచ్చు.
2టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ రసంలో హాప్ టేబుల్ స్పూన్ పచ్చి తేనె జోడించాలి. దీన్ని జుట్టుకు పట్టించి అరగంట సేపు అలాగే ఉంచాలి. ఆ తరువాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.
శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచే సూపర్ ఫుడ్స్ లిస్ట్ ఇదీ..!
1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, 3 టీస్పూన్ల ఉల్లిపాయ రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయాలి. అరగంట సేపు అలాగే ఉంచి ఆ తరువాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.
3 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ రసం, 5 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె, 1టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. దీన్ని అరగటం సేపు అలాగే ఉంచి ఆ తరువాత తేలికపాలి షాంపూతో తలస్నానం చేయాలి.
ఉల్లిపాయ షాంపూ ప్రయోజనాలు..
ఉల్లిపాయ రసం జుట్టు కుదుళ్లకు ఎక్కువ పోషకాలను ఇస్తుంది. ఇది మెరుగైన పోషణను అందిస్తుంది.
పాదాలు, మడమల్లో ఈ లక్షణాలు ఉంటే చక్కెర స్థాయిలు ఎక్కువున్నట్టే..!
పొడి జుట్టు ఉన్నవారికి జుట్టు పొడిబారకుండా చేస్తుంది. తలకు తేమను అందిస్తుంది.
జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
ఉల్లిపాయలు పొడి జుట్టును, దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేసి జుట్టు పెరగడంలో సహాయపడే అనేక సమ్మేళనాలను కలిగి ఉంటాయి.
ఉల్లిపాయలో కెంప్ఫెరోల్, క్వెర్సెటిన్ వంటి ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. అవి శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్, వాసోడైలేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి నెత్తిమీద రక్త ప్రసరణను ప్రోత్సహించడంలో సహాయపడతాయి.
ఉల్లిపాయలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు తల దురదను తగ్గించడంలో సహాయపడతాయి.ఫలితంగా చుండ్రు సమస్యను సులువుగా తగ్గిస్తాయి.
ప్రపంచంలో అద్భుతమైన జ్ఞాపకశక్తి కలిగిన జంతువులు ఇవే..!
వర్షాకాలంలో ఈ కాంబినేషన్ ఫుడ్స్ అస్సలు తినకండి..!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.