Optical Illusion: మీ మెదడు పనిచేసే స్పీడ్ ఎంత? ఫొటోలో 994 సంఖ్య ఎక్కడుందో 10 సెకెన్లలో కనుక్కోండి చూద్దాం..!
ABN , Publish Date - Aug 18 , 2024 | 11:41 AM
చిన్నప్పుడు దినపత్రికల్లోనూ, అనుబంధ సంచికల్లోనూ పజిల్స్, పద బంధాలు పూర్తీ చేయడాన్ని చాలా ఆస్వాదించేవారు. బొమ్మల మధ్య తేడాలు కనుక్కోవడం, ఫొటోలలో కనిపించని విషయాన్ని కనిపెట్టడం వంటివి చాలా సరదాగా అదే సమయంలో మెదడుకు మంచి వ్యాయామంగానూ అనిపించేవి. అయితే..
చిన్నప్పుడు దినపత్రికల్లోనూ, అనుబంధ సంచికల్లోనూ పజిల్స్, పద బంధాలు పూర్తీ చేయడాన్ని చాలా ఆస్వాదించేవారు. బొమ్మల మధ్య తేడాలు కనుక్కోవడం, ఫొటోలలో కనిపించని విషయాన్ని కనిపెట్టడం వంటివి చాలా సరదాగా అదే సమయంలో మెదడుకు మంచి వ్యాయామంగానూ అనిపించేవి. అయితే కాలక్రమంలో వీడియో గేమ్స్, కార్టూన్స్, సోషల్ మీడియా వల్ల అవి తగ్గిపోయినా మళ్లీ కొత్త మెరుగులు అద్దుకుని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఫన్ ను పంచుతున్నాయి. వాటికి సంబంధించిన ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని 10 సెకెన్లలో పరిష్కరిస్తే మీ మెదడు పనితీరు భేష్ అని అంటున్నారు. దీని వైపు ఓ లుక్కేస్తే..
Soaked Almonds Vs Soaked Raisins: నానబెట్టిన బాదం లేదా నానబెట్టిన ఎండుద్రాక్ష.. బరువు తగ్గడానికి ఏది మేలంటే..!
ఆప్టికల్ ఇల్యూజన్ మెదడును, కంటి చూపును కూడా కన్ఫ్యూజ్ చేస్తాయి. మెదడు పనితీరు, కంటిచూపు మెరుగ్గా ఉండేవారు మాత్రమే దీన్ని తొందరగా పరిష్కరించగలుగుతారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోలో 964 సంఖ్యలు ఉన్నాయి. అడ్డువరుసలోనూ, నిలువు వరుసలోనూ ఇదే సంఖ్య ఉంది. అయితే ఈ సంఖ్యల మధ్య 994 సంఖ్య ఒకటి ఉంది. అదెక్కడుందో 10 సెకెన్లలో కనుక్కోవాలి.
చాలా మంది దీన్ని ఛాలెంజ్ గా తీసుకుని కనిపెట్టలేక చేతులెత్తేస్తున్నారు. కంటి చూపు, మెదడు పనితీరు చాలా చురుగ్గా ఉన్నవారు మాత్రమే దీన్ని 10 సెకెన్లలోపు కనిపెట్టగలుగుతున్నారు. ఇక ఫొటోలో ఉన్న 994 సంఖ్య విషయానికి వస్తే.. ఈ సంఖ్య ఫొటోలోనే ఉన్నా దాని చుట్టూ 964 సంఖ్యలు ఉండటం మూలాన వెంటనే దాన్ని కనిపెట్టలేరు. మీ మెదడు మిమ్మల్ని మోసం చేస్తుంది. కన్ప్యూజ్ అవుతుంది. కానీ ఈ ఫొటోలో పదకొండవ అడ్డువరుసలో.. ఐదవ నిలువు వరుసను గమనిస్తే 994 సంఖ్య కనిపిస్తుంది.
Health Tips: రోజువారీ జీవితంలో ఈ 6 మార్పులు చేసుకుంటే చాలు.. క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది..!
ఈ సంఖ్యను 10 సెకెన్ల లోపు కనిపెట్టిన వారి మెదడు పనితీరు, కంటిచూపు మాత్రమే మెరుగ్గా ఉన్నట్టు కాదు.. వారి ఆలోచనా తీరు, వారు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ మెరుగ్గా ఉంటారట. మానసికంగా కూడా మెరుగ్గా ఉంటారట. ఇలాంటివి మెదడుకు మంచి వ్యాయామంగా పనిచేస్తాయని, వీటిని తరచుగా ప్రాక్టీస్ చేస్తుండాలని మానసిక నిపుణులు అంటున్నారు.
ఖాళీ కడుపుతో నానబెట్టిన జీడిపప్పు తింటే ఏం జరుగుతుందంటే..!
గులాబీ రేకులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.