Share News

Optical Illusion: మీరు జీనియస్ అయితే ఫొటోలో పిల్లి ఎక్కడుందో 9సెకెన్లలో కనుక్కోండి చూద్దాం..

ABN , Publish Date - Oct 24 , 2024 | 08:55 PM

ఆప్టికల్ భ్రమలు కళ్లను, మెదడును కూడా మోసం చేస్తాయి. వీటిని సెకెన్లలోపు సాల్వ్ చేయగలిగితే వాళ్లు నిజంగా జీనియస్ లే..

Optical Illusion: మీరు జీనియస్ అయితే ఫొటోలో పిల్లి ఎక్కడుందో 9సెకెన్లలో కనుక్కోండి చూద్దాం..

ఆప్టికల్ ఇల్యూషన్ ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతోంది. ఇందు భాగంగా ఉన్న ఫొటోలు చూసినప్పుడు మెదడు గందరగోళానికి లోనవుతుంది. మీ కళ్లు మిమ్మల్ని మోసం చేస్తాయి. ఇవి ప్రాబ్లమ్స్ ను పరిష్కరించడంలోనూ, జ్ఞాపక శక్తిని, ఆలోచనా సామర్థ్యాన్ని పెంచడంలోనూ సహాయపడతాయి. ప్రస్తుతం ఆప్టికల్ ఇల్యూషన్ లో భాగంగా ఒక ఫొటో సోషల్ మీడీయాలో వైరల్ అవుతోంది. ఇందులో పిల్లి ఎక్కడుందో కనుక్కోమని ఛాలెంజ్ విసురుతున్నారు. కనుక్కున్నవారు జీనియస్ లు అని అంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే..

దక్షిణ భారతదేశంలో తప్పక చూడాల్సిన 7 దేవాలయాలు ఇవి..


జంతువులు ప్రకృతిలో భాగమైన మొక్కలు, కొండలు, నీరు వంటి వాటిలో కలిసిపోయినప్పుడు వాటి మధ్య ఆ జంతువులను గుర్తించడం కష్టంగా ఉంటుంది. ఫొటోలో ఒక చోట దట్టంగా పెరిగిన స్నేక్ ప్లాంట్ మొక్క ఉంది. ఈ మొక్క మధ్యలో ఒక పిల్లి దాక్కుంది. ఈ పిల్లి మొక్కల మధ్యలో నుండి బయటకు తొంగి చూస్తోంది. దీన్ని 9 సెకెన్లలో కనుక్కోవాలి.

cat1.jpg

ఫొటోలో మొక్కలో దాగున్న పిల్లిని కనుక్కోవడంలో చాలామంది ఫెయిల్ అవుతున్నారు. కేవలం 9 సెకెన్లలో కనుక్కోవాలనే నిబంధనతో చేతులెత్తేస్తున్నారు, అయితే ఫొటోను జాగ్రత్తగా పరిశీలిస్తే ఎడమవైపున స్నేక్ ప్లాంట్ ఆకుల మధ్యన నుండి తొంగి చూస్తున్న పిల్లి కనిపిస్తుంది. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ సమస్యలను పరిష్కరించడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుందని నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి..

Vitamin-D: విటమిన్-డి సప్లిమెంట్లను రోజూ తీసుకున్నా కొందరికి పనిచేయవు ఎందుకని..

Health Tips: ఈ వ్యక్తులు నెయ్యిని అస్సలు తినకూడదు..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 24 , 2024 | 08:55 PM