Share News

Optical Illusion: ఛాలెంజ్ చేస్తారా.. ఫొటోలో ఎలుగుబంటి ఎక్కడ ఉందో కనిపెడతారా..

ABN , Publish Date - Nov 02 , 2024 | 03:32 PM

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు కేవలం కాలక్షేపానికి మాత్రమే కాదు.. బుర్రకు, కంటికి బోలెడు పని పెడతాయి.. అలాగే వాటి పనితీరుకు పదును కూడా పెడతాయి.

Optical Illusion: ఛాలెంజ్ చేస్తారా.. ఫొటోలో ఎలుగుబంటి ఎక్కడ ఉందో కనిపెడతారా..
Optical Illusion

సోషల్ మీడియాలో సరదాగా గడుపుతూనే మెదడుకు పదును పెట్టుకోవాలంటే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలను పరిష్కరించవచ్చు. కేవలం ఆప్టికల్ ఇల్యూషన్ మాత్రమే కాదు.. ఎన్నో రకాల పజిల్స్, పద వినోదం, సుడోకు వంటివి కూడా సరదాగా కాలక్షేపాన్ని అస్తూనే బుర్రను పదును పెడతాయి. ప్రస్తుతం సోషల్ మీడీయాలో వైరల్ అవుతున్న ఒక ఫొటో అందరికీ ఛాలెంజ్ విసురుతోంది. మీ కళ్లు, మెదడు ఎంత చురుగ్గా పనిచేస్తాయో ప్రూవ్ చేసుకోమని ఛాలెంజ్ చేస్తోంది. ఈ ఛాలెంజ్ గురించి కాస్త వివరంగా తెలుసుకుంటే..

Skin Care: ముఖ చర్మం మెరిసిపోవాలంటే.. ఇంట్లోనే ఈ డ్రింక్ తయారు చేసుకుని తాగండి..!


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అడవిలో ఒక ప్రదేశానికి చెందినది. అడవిలో ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో ఒక గుడిసె ఉండటం చూడవచ్చు. ఈ గుడిసె చుట్టూ చెట్లు ఉన్నాయి. అయితే ఈ ఫొటోలో ఒక చోట ఎలుగుబంటి ఉంది. ఆ ఎలుగుబంటిని కనుక్కోవడమే ఛాలెంజ్. చాలామంది ఈ ఛాలెంజ్ ను స్వీకరించారు. చాలా ప్రయత్నాలు చేసి చివరకు చేతులెత్తేస్తున్నారు. కంటికి కనిపించని విధంగా.. ఎంతో పదునైన దృష్టి, చురుకైన మెదడు ఉన్నవారు మాత్రమే ఈ ఫొటోలో ఎలుగుబంటిని కనుగొంటున్నారు.

WhatsApp Image 2024-11-02 at 11.20.02 AM.jpeg

IQ Test: మీ ఐక్యూ లెవల్స్ కు ఇదే ఛాలెంజ్.. ఈ ఫొటోలో న్యూస్ పేపర్ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..


ఫొటోను జాగ్రత్తగా పరిశీలిస్తే గుడిసె పై భాగంలో ఇంటిలో పొయ్యి తాలూకు పొగ వెళ్లడానికి అనువుగా ఏర్పాటుచేసిన పొగ గొట్టం ఉంది. ఈ పొగ గొట్టం పైన నిశితంగా పరిశీస్తే ఎలుగుబంటిని గుర్తుపట్టవచ్చు. నిజానికి అది నిజమైన ఎలుగుబంటి కాదు.. చెట్టు కొమ్మలు అన్నీ కలిసిపోయి ఎలుగుబంటి ఆకారంతో ఉన్నాయి. దీన్ని అంత తేలిగ్గా గుర్తించడం సాధ్యం కాదు.. కానీ ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ లు ప్రయత్నించడం వల్ల బ్రెయిన్ పవర్ పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి..

Rice Vs Roti: అన్నం లేదా చపాతీ.. రెండింటిలో ఏది ఆరోగ్యమంటే..

Health Tips: దీపావళి తరువాత చాలా మంది ఎదుర్కునే సమస్యలు.. వాటికి పరిష్కారాలు ఇవిగో..

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Nov 02 , 2024 | 03:34 PM