Share News

Parenting: తల్లిదండ్రులు పిల్లలకు ఈ 5 అలవాట్లు నేర్పిస్తే చాలు.. పిల్లలు సక్సెస్ కావడం పక్కా..!

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:20 PM

ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే పిల్లలకు ఇది మంచి, ఇది చెడు అంటూ చాలా నిర్ణయాలు తీసుకుని వాటిని పిల్లల జీవితంలో ఫాలో అవుతారు. అయితే తల్లిదండ్రులు చేసే ఈ పనుల వల్ల కొన్నిసార్లు జీవితంలో వైఫల్యాలు కూడా ఎదురవుతాయి.

Parenting:  తల్లిదండ్రులు పిల్లలకు ఈ 5 అలవాట్లు నేర్పిస్తే చాలు.. పిల్లలు సక్సెస్ కావడం పక్కా..!

పిల్లల పెంపకం చాలా పెద్ద ఛాలెంజ్. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే పిల్లలకు ఇది మంచి, ఇది చెడు అంటూ చాలా నిర్ణయాలు తీసుకుని వాటిని పిల్లల జీవితంలో ఫాలో అవుతారు. అయితే తల్లిదండ్రులు చేసే ఈ పనుల వల్ల కొన్నిసార్లు జీవితంలో వైఫల్యాలు కూడా ఎదురవుతాయి. ముఖ్యంగా పిల్లల ప్రవర్తన, వారి అలవాట్లు కూడా పిల్లలు సక్సెస్ కావడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పిల్లలు సక్సెస్ కావడానికి దోహదపడే 5 అలవాట్ల గురించి పేరెంటింగ్ నిపుణులు చెప్పుకొచ్చారు. అవేంటో తెలుసుకుంటే..

సృజనాత్మకత..

సృజనాత్మకత సాధారణ వ్యక్తుల నుండి ప్రత్యేకంగా ఉండేలా చేస్తుంది. పిల్లలలో సృజనాత్మకతను గుర్తించి వారిని ప్రోత్సహించడం ద్వారా పిల్లలలో ప్రతిభ, నైపుణ్యాలు పెరుగుతాయి. ఇవి పిల్లలను విజయం వైపు నడవడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

ఏసీలో ఎక్కువసేపు ఉంటే ఎదురయ్యే పరిణామాలు ఇవే..!


మేనేజ్మెంట్ స్కిల్స్..

ముందుగా ఏ పని చేయాలి, తర్వాత ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఏ పనికి ఎంత సమయం ఇవ్వాలి, సమయాన్ని ఎలా విభజించుకోవాలి. ఇవన్నీ పిల్లలకు చాలా సహాయపడతాయి. సమయ నిర్వాహణ దీనివల్లే అలవడుతుంది. అందుకే పిల్లలకు టైం మేనేజ్‌మెంట్ నేర్పించడంతోపాటు, మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా చిన్నతనం నుంచే అలవర్చాలి.

ఎమోషన్స్..

భావోద్వేగాలను నియంత్రించుకోవడం నేర్చుకునే వ్యక్తులు విజయం సాధించడమే కాకుండా సంతోషంగా కూడా ఉంటారు. అదేవిధంగా సంబంధాలను ఏర్పరచుకునే అలవాటు ఉన్నవారు ఇతరుల పట్ల సద్భావన కలిగి ఉంటారు. వారి భావోద్వేగాలను నియంత్రించగల వ్యక్తులు ఆగకుండా ముందుకు సాగుతారు. పిల్లలు ఎవరికీ అసూయపడకుండా, వారి ఎమోషన్స్ ఇతరుల మీద ఆధిపత్యం చెలాయించకుండా ఉండాలంటే ఎమోషన్స్ ను నియంత్రించుకునేలా చేయడం ముఖ్యం.

తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలివీ..!


పోలిక..

తల్లిదండ్రులు తమ బిడ్డను ఎవరితోనూ పోల్చుకోకుండా ఉండటమే కాకుండా, తనను తాను ఎవరితోనూ పోల్చుకోవద్దని పిల్లలకు నేర్పించాలి. జీవితంలో ముందుకు వెళ్లడమే తన ధ్యేయమని పిల్లలకు వివరించడం ముఖ్యం.

స్వంత నిర్ణయాలు..

తల్లిదండ్రులు తమ బిడ్డ ఎల్లప్పుడూ సరైన మార్గాన్ని ఎంచుకోవాలని కోరుకుంటారు. అందుకే పిల్లలు స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిదని భావిస్తారు. కానీ పిల్లలు స్వంత నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకునే వరకు, అతను ఎప్పటికీ తప్పొప్పులు అర్థం చేసుకోలేరు. పిల్లలు సొంతంగా పనులు చేయగలరు, సొంతంగా ఆలోచించగలరు, అలాగే సొంతంగా నిర్ణయాలు తీసుకోగలరు. తల్లిదండ్రులు కూడా ఆ విధంగా పిల్లలను ప్రోత్సహించాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలివీ..!

ఏసీలో ఎక్కువసేపు ఉంటే ఎదురయ్యే పరిణామాలు ఇవే..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 25 , 2024 | 01:20 PM