Share News

Parenting: పిల్లలకు కొండంత ఆత్మవిశ్వాసం రావాలంటే ఈ 5 విషయాలు నేర్పించండి చాలు..!

ABN , Publish Date - Jun 22 , 2024 | 09:27 PM

ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్నవారు నిర్ణయాలు తీసుకోవడంలో అయినా, ఏ విషయం గురించి అయినా ఆలోచించడంలో అయినా జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడంలో అయినా ఎప్పుడూ ముందుంటారు. అయితే పిల్లలు కొండంత ఆత్మవిశ్వాసంతో ఉండాలంటే..

Parenting:  పిల్లలకు  కొండంత ఆత్మవిశ్వాసం  రావాలంటే ఈ 5 విషయాలు నేర్పించండి చాలు..!

ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఇది మనిషి జీవితాన్ని మరొక స్థాయికి తీసుకువెళుతుంది. ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్నవారు నిర్ణయాలు తీసుకోవడంలో అయినా, ఏ విషయం గురించి అయినా ఆలోచించడంలో అయినా జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడంలో అయినా ఎప్పుడూ ముందుంటారు. అయితే పిల్లలు కొండంత ఆత్మవిశ్వాసంతో ఉండాలంటే తల్లిదండ్రులు పిల్లలకు 5 విషయాలు తప్పక నేర్పించాలి. అవేంటో తెలుసుకుంటే..

మాట్లాడటం..

ఆకట్టుకునేలా మాట్లాడటం ఒక కళ. పిల్లలు ఆకట్టుకునేలా, అందంగా, నైపుణ్యంతో మాట్లాడటం నేర్చుకుంటే వారు ఎవరినైనా ఇట్టే ఆకర్షించగలుగుతారు. నలుగురిలో తాము ప్రత్యేకంగా నిలబడగలుగుతారు. అంతే కాదు ఇలా ఆకట్టుకునేలా మాట్లాడే పిల్లలకు ఏదైనా పనిని నేను చేయలేను అనే నిరాశ, నిస్పుృహ కు బదులుగా నేను చేస్తాను అనే ధైర్యం వారికి వస్తుంది. అందుకే పిల్లలకు మాట్లాడటం నేర్పించాలి.

వీర్యకణాల సంఖ్యను పెంచే శక్తివంతమైన ఆహారాలు ఇవి..!


తప్పుల నుండి నేర్చుకోవడం..

తప్పులు అందరూ చేస్తారు. చిన్న, పెద్ద అందరూ దీనికి అతీతం కాదు. అయితే తప్పుల నుండి నేర్చుకోవడం, దాన్ని జీవితంలో గొప్ప అనుభవంగా మార్చుకోవడం కొందిరకే సాధ్యం. ఈ అలవాటు పిల్లలకు నేర్పించాలి. పిల్లలు తాము చేసిన తప్పును అంగీకరించడం, ఆ తప్పుల నుండి పాఠాలు నేర్చుకునే దిశగా వారిని ప్రేరేపించడం ముఖ్యం.

చర్చలు..

'మీరు పిల్లలు పెద్ద వారితో మాట్లాడటం ఏం పని, మీకు ఏమైనా కావాలంటే చెప్పండి తెచ్చిస్తాం. అంతేగాని పెద్దలు మాట్లాడుతుంటే మధ్యలో రావద్దు' 100 కు 99% మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఉద్దేశించి చెప్పే మాట ఇది. అయితే పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడటం, విషయాలను చర్చించడం చాలా అవసరం. దీని వల్ల పిల్లలలో ఆలోచనా విస్తృతి పెరుగుతుంది. కానీ పిల్లల వయసుకు మించిన విషయాలు, వారి వయసుకు సంబంధం లేని చర్చలు ఎప్పుడూ వారి ముందు చేయకూడదు.

ఎముకలు ఉక్కులా దృఢంగా మారాలంటే ఇవి అలవాటు చేసుకోండి..!


అభిప్రాయాలు..

నువ్వు చిన్న పిల్లవాడివి.. నీకేం తెలీదు.. పెద్దవాళ్లు చెప్పినట్టు విను.. ఇది చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో చెప్పే మాట. పిల్లలకు విషయాల మీద అవగాహన, వారి అనుభవాలు చిన్నవే అయినా ఏదైనా విషయం పట్ల పిల్లల అబిప్రాయం చెప్పనివ్వాలి. వారి ఆలోచనలు, వారి అభిప్రాయాలు తల్లిదండ్రులు ఓపికగా వినాలి.

నిర్ణయాలు..

పిల్లలకు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వాలి. ఇది వారి ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. పిల్లలు తీసుకునే నిర్ణయాలు తప్పుగా ఉంటాయనే ఆలోచన తల్లిదండ్రులకు ఉంటే పిల్లలు తమ నిర్ణయం చెప్పిన తరువాత అందులో తప్పు ఉందని అనిపిస్తే ఆ నిర్ణయం గురించి వివరంగా చర్చించాలి. ఇలా పిల్లలు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండాలో పరోక్షంగా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించవచ్చు. దీని వల్ల పిల్లలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

జామ ఆకుల కషాయం తాగితే జరిగే మేలు ఎంతంటే..!

ఎముకలు ఉక్కులా దృఢంగా మారాలంటే ఇవి అలవాటు చేసుకోండి..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 22 , 2024 | 09:27 PM