Viral Video: ఈ రైల్వే గార్డుకు సలాం కొట్టాల్సిందే.. తల్లిదండ్రులను పిల్లలతో ఎలా కలిపాడో చూడండి..
ABN , Publish Date - Nov 07 , 2024 | 09:04 AM
రైలు నిర్ణీత సమయాన్ని మించి స్టేషన్‌లో ఆగదు. ఆ సమయంలోనే ప్రయాణికులు ఎక్కడం, దిగడం చేయాలి. ముఖ్యంగా చిన్న పిల్లలో ప్రయాణించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఇకపై జాగ్రత్తగా ఉండాలని అర్థమవుతుంది.
రైలు ప్రయాణం (Train Journey) ఎంత సౌకర్యంగా ఉన్నప్పటికీ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే రైలు నిర్ణీత సమయాన్ని మించి స్టేషన్‌లో ఆగదు. ఆ సమయంలోనే ప్రయాణికులు ఎక్కడం, దిగడం చేయాలి. ముఖ్యంగా చిన్న పిల్లలో (Child) ప్రయాణించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఇకపై జాగ్రత్తగా ఉండాలని అర్థమవుతుంది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).
kushwah_aalok అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ జంక్షన్‌లో ఈ ఘటన జరిగింది. స్టేషన్‌లో రైలు ఆగినప్పుడు తమ పిల్లలను లోపలే ఉంచి, తల్లిదండ్రులు కిందకు దిగారు. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న దుకాణంలో ఏవో కొన్నారు. అయితే వారు వెనక్కి తిరిగి చూసేసరికి ట్రైన్ బయల్దేరిపోయింది. వేగంగా కదులుతోంది. వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. లోపల పిల్లలు ఉండిపోవడంతో వారికి గుండె జారిపోయింది. అయితే ఆ వ్యక్తి రైలు చివరి భోగీలో ఉన్న గార్డుకు (Railway Gaurd) విషయం చెప్పాడు. వెంటనే స్పందించిన గార్డు చైన్ లాగేసి ట్రైన్‌ను ఆపాడు. దీంతో వారు ట్రైన్ ఎక్కి తమ పిల్లలను చేరుకోగలిగారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ అయిన ఈ వీడియోను వేల మంది వీక్షించారు. వందల మంది లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ``ఆ రైల్వే గార్డుకు సలాం చెప్పాల్సిందే``, ``ఆ తల్లిదండ్రులు చాలా కూల్‌గా ఉన్నారు``, ``ఇది వారికి చాలా పెద్ద పాఠం``, ``పిల్లలను ఎక్కడా ఒంటరిగా వదలకూడదు``, ``పాపం.. ఆ పిల్లలు ఎంత భయపడి ఉంటారో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఈ బైక్ ఎలా నడుస్తోందబ్బా.. పెట్రోల్ లేదు, పెడల్ లేదు.. గాలిలో దూసుకుపోతున్న బైక్..
Viral Video: ఈమె ఒక వర్గానికి ఇన్‌స్పిరేషన్.. వర్షంలో నిల్చుని ఏం చేస్తోందో చూడండి.. నవ్వాపుకోలేరు..
Viral Video: అందరికీ ఇలాంటి టీచర్ ఉండాలి.. క్లాస్‌రూమ్‌లో పిల్లలకు ఎలా పాఠం చెబుతున్నారో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.