Personality Test: మీ వేలి ఆకారం మీరు ఎలాంటి వాళ్లో చెప్పేస్తుందట.. ఒక సారి చెక్ చేసుకోండి..!
ABN , Publish Date - Jun 15 , 2024 | 12:30 PM
మనిషి చేతులు, చేతి వేళ్లు, నిలబడే తీరు, నడిచే విధానం, పడుకునే తీరు.. ఇలాంటివన్నీ ఒక మనిషి వ్యక్తిత్వం ఎలాంటిదో చెబుతాయా.. అని ప్రశ్నిస్తే.. అవుననే సమాధానం వస్తోంది. వ్యక్తిత్వ విశ్లేషకులు మనిషిలో కొన్ని విషయాలు గమనించి ఆ మనిషి ఎలాంటి వాడు అనేది ఇట్టే చెప్పేస్తారు. ఇలాంటి పర్సనాలిటి టెస్ట్ లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి.
మనిషి చేతులు, చేతి వేళ్లు, నిలబడే తీరు, నడిచే విధానం, పడుకునే తీరు.. ఇలాంటివన్నీ ఒక మనిషి వ్యక్తిత్వం ఎలాంటిదో చెబుతాయా.. అని ప్రశ్నిస్తే.. అవుననే సమాధానం వస్తోంది. వ్యక్తిత్వ విశ్లేషకులు మనిషిలో కొన్ని విషయాలు గమనించి ఆ మనిషి ఎలాంటి వాడు అనేది ఇట్టే చెప్పేస్తారు. ఇలాంటి పర్సనాలిటి టెస్ట్ లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడూ అలాంటిదే వైరల్ అవుతోంది. చేతి వేళ్లను చూసి మనిషి వ్యక్తిత్వాన్ని చెప్పడం ఇందులో సారాంశం. మూడు రకాల చేతి వేళ్లు, ఆయా వ్యక్తుల లక్షణాలు, గుణాలు ఇందులో వివరించారు. అవేంటో తెలుసుకుంటే..
మహిళలలో ఐరన్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!
ఫొటోలో మూడు రకాల చేతి వేళ్లు ఉన్నాయి.
1. స్ట్రైయిట్ ఫింగర్స్..
2. పాయింటెడ్ ఫింగర్స్
3. నకిల్డ్ ఫింగర్స్
1. స్టైయిట్ ఫింగర్స్..
స్టైయిట్ ఫింగర్స్ ఉన్నవారు చాలా ఆలోచనా పరులు. స్నేహితులు, కుటుంబ సభ్యులు సలహాల కోసం ఇలాంటి వారిని ఆశ్రయిస్తారట. సాధారణ జీవితంలో చాలా ఆచరణాత్మకంగా ఉంటారట. నిలకడగా ఉండటానికి వీరు ఇష్టపడతారు. డ్రామా, గాసిప్ లకు దూరంగా ఉంటారు. ఖచ్చితత్వం, స్థిరత్వం వీరిలో ఎక్కువ. ఇతరులకు నమ్మకాన్ని ఇవ్వగలుగుతారు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటారు. పొదుపు చేయడానికి ఆసక్తి చూపిస్తారు.
ఈ మొఘల్ మహారాణుల తెలివితేటలు తెలిస్తే షాకవుతారు..!
2. పాయింటెడ్ ఫింగర్స్..
చేతి వేళ్లు సగం వరకు పొడవుగా ఉండి ఆ తరువాత వంపు తిరిగినట్టు ఉండేవే పాయింటెడ్ ఫింగర్స్. ఇతరులకు ప్రేరణ కలిగిస్తూ, కొత్త విషయాలు ఆవిష్కరిస్తూ అబివృద్ది చెందే లక్షణాలు వీరిలో ఉంటాయట. వీరి జీవితం వాస్తవికత కంటే ఊహాత్మకంలోనే ఎక్కువ. దానికి తగినట్టే ఊహించని విషయాల నుండి సంతోషం పొందుతుంటారు. ప్రయోగాలకు అస్సలు భయపడరు. సవాళ్ళంటే చాలా ఇష్టం. డబ్బు విషయంలో రిస్క్ తీసుకుంటారు.
ఆడవారిలో కాల్షియం తక్కువ ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!
3.నకిల్డ్ ఫింగర్స్..
వేళ్లు వంపులు తిరిగి ఉంటే వీటిని నకిల్డ్ ఫింగర్స్ అంటారు. మెటికల దగ్గర వంపులు ఉంటాయి. జీవితంలో కఠినమైన పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని ఎదుగుతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలేవీ వీరిని కంగారుకు గురిచెయ్యవు. వీరిలో పట్టుదల ఎక్కువ. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడంలో ధైర్యంగా ఉంటారు. అనుకూల వాతావరణం ఉంటే వీరికి తిరిగుండదు. వీరు రిలేషన్ లో చాలా నమ్మకస్తులు. చాలా నిజాయితీగా ఉంటారు. అయితే కొన్ని విషయాలలో రాజీ పడితే వీరి వైవాహిక జీవితం బాగుంటుంది. లక్ష్యాలు సాధించడంలో అయినా, ఇతరుల కోసం త్యాగం చేయడంలో అయినా ఈ వ్యక్తులు ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. భవిష్యత్తును నిర్మించుకోవడంలో పూర్తీ ఆత్మవిశ్వాసంతో ఉంటారు.
జాగ్రత్త.. ఈ శబ్దాలు వింటే వినికిడి లోపం రావడం ఖాయం..!
ఆడవారిలో కాల్షియం తక్కువ ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.