Viral Video: ఎంత అన్యాయం.. లంచం ఇవ్వలేదని పాస్‌పోర్ట్ చింపేసిన పోస్ట్‌మ్యాన్.. వీడియో వైరల్..
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:22 AM
తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే. రూ.500 లంచం ఇవ్వలేదని ఓ పోస్ట్‌మ్యాన్ అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. పాస్‌పోర్ట్‌లోని అతి ముఖ్యమైన పేజీని చింపేశాడు. ఆ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దేశం ఎంత అభివృద్ధి పథంలో సాగుతున్నా ప్రభుత్వ కార్యాలయాల నుంచి మాత్రం లంచం (Bribe) అనే జాడ్యాన్ని మాత్రం వదలగొట్టలేకపోతున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు లంచం కోసం సామన్య పౌరులను పీడిస్తూనే ఉన్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో జరిగిన ఓ ఘటన గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే. రూ.500 లంచం ఇవ్వలేదని ఓ పోస్ట్‌మ్యాన్ (Postman) అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. పాస్‌పోర్ట్ (Passport)లోని అతి ముఖ్యమైన పేజీని చింపేశాడు. ఆ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
లఖ్‌నవూలోని ఓ వ్యక్తి పాస్‌పోర్ట్ కోసం అప్లై చేశాడు. పోస్ట్ ద్వారా ఆ పాస్‌పోర్ట్ రావడంతో దానిని తీసుకోవడానికి ఆ వ్యక్తి పోస్టాఫీస్‌కు వెళ్లాడు. అయితే పాస్‌పోర్ట్ ఇవ్వాలంటే తనకు రూ.500 లంచం ఇవ్వాలని పోస్ట్‌మ్యాన్ డిమాండ్ చేశాడు. లంచం ఇచ్చేందుకు ఆ వ్యక్తి నిరాకరించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పోస్ట్‌మ్యాన్ పాస్‌పోర్ట్‌లోని అతి ముఖ్యమైన పేజీని చింపేశాడు. ఆ ఘటన మొత్తం పోస్టాఫీస్‌లో అమర్చిన సీసీటీవీలో రికార్డు అయింది. బాధిత వ్యక్తి సదరు పోస్ట్‌మ్యాన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
అధికారులు విచారణ ప్రారంభించి మరిన్ని ఆధారాలను సేకరించేందుకు పోస్టాఫీసులోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పోస్టాఫీసులో జరిగిన ఈ ఘటన గవర్నమెంట్ ఆఫీస్‌ల్లో అవినీతిపై తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. చాలా మంది వినియోగదారులు పోస్ట్‌మ్యాన్ చర్యలను ఖండించారు. ఇలాంటి వ్యక్తుల వల్లే మన ప్రభుత్వ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అవుతున్నాయని, అవినీతికి వ్యతిరేకంగా బలమైన, కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral: ఇది ``మంజుమ్మల్ బాయ్స్`` కథ.. మొబైల్ కోసం వెళ్లి గుహలోకి వెళ్లిన యువతికి ఏమైందంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోెసం క్లిక్ చేయండి..