Share News

Raw Milk: ఖరీదైన క్రీములు కాదు.. పచ్చి పాలు ఇలా రోజూ ముఖానికి రాసుకోండి.. మెరిసిపోతారు..!

ABN , Publish Date - Jul 25 , 2024 | 09:33 AM

ముఖం కాంతివంతంగా, యవ్వనంగా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అందుకోసమే ఖరీదైన ఫేస్ క్రీములు కూడా ట్రై చేస్తుంటారు. కానీ వీటి నుండి ఆశించిన ఫలితం అంతగా ఉండదు. ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలన్నా, అందంగా కనిపించాలన్నా ఫేస్ క్రీముల కంటే..

Raw Milk: ఖరీదైన క్రీములు కాదు.. పచ్చి పాలు ఇలా రోజూ ముఖానికి రాసుకోండి.. మెరిసిపోతారు..!
Raw Milk

ముఖ చర్మ సంరక్షణ కోసం అమ్మాయిలు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ముఖం కాంతివంతంగా, యవ్వనంగా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అందుకోసమే ఖరీదైన ఫేస్ క్రీములు కూడా ట్రై చేస్తుంటారు. కానీ వీటి నుండి ఆశించిన ఫలితం అంతగా ఉండదు. ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలన్నా, అందంగా కనిపించాలన్నా ఫేస్ క్రీముల కంటే ఇంటి చిట్కాలు, ప్రాచీన పద్దతులు బాగా సహాయపడతాయి. ఎన్నో ఏళ్ల నుండి చర్మ సంరక్షణలో భాగంగా ఉపయోగిస్తున్న పచ్చి పాలను రోజూ ముఖానికి రాసుకుంటే అద్బుత ఫలితాలు ఉంటాయి. అసలు పచ్చిపాలు ముఖానికి చేసే మేలు ఏంటి? వాటిని ఎలా ఉపయోగించాలి తెలుసుకుంటే..

Stomach Problems: పొట్టకు సంబంధించి అన్ని సమస్యలకు ఒకటే మందు.. ఈ పొడిని రోజూ తీసుకుంటే..!



పచ్చిపాలు ప్రయోజనాలు..

పచ్చిపాలు ముఖ చర్మలో ట్యానింగ్ ను తొలగించి సహజమైన మెరుపును ఇస్తుంది. ఇది చర్మానికి తేమను, పోషణను అందిస్తుంది. దీని వల్ల ముఖం మృదువుగా మారుతుంది.

పచ్చిపాలను రోజూ ముఖానికి రాసుకుంటూ ఉంటే చర్మం మీద మృత కణాలు తొలగిపోతాయి. ఇది చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. చర్మం అందంగా, యవ్వనంగా మారడంతో పాటు ముఖం మీద మచ్చలు, పిగ్మెంటేషన్ తొలగిపోతాయి. దీని వల్ల మచ్చలేని చందమామ లాంటి చర్మం సొంతమవుతుంది. ముఖంలో గ్లో పెరుగుతుంది.

బరువు తగ్గాలనుకునే వారికోసం భలే టిఫిన్లు.. వీటిలో కేలరీలు చాలా తక్కువ..!


పచ్చిపాలు ఇలా వాడాలి?

ఒక గిన్నెలో పచ్చిపాలు తీసుకోవాలి. దీనిలో కొద్దిగా రోజ్ వాటర్ కలపాలి. దీన్ని ముఖానికి రాసుకుని వృత్తాకారంలో సున్నితంగా మసాజ్ చేయాలి. ఇది డెడ్ స్కిన్ ను శుభ్రపరుస్తుంది. మతకణాలు తొలగించి చర్మానికి పునరుజ్జీవనాన్ని ఇస్తుంది. ముఖం కాంతివంతంగా మారుస్తుంది.

ఒక చిన్న కప్ లో పచ్చిపాలు తీసుకోవాలి. ఇందులో స్వచ్చమైన కుంకుమ పువ్వు రెమ్మలు వేయాలి. దీన్ని కొద్దిసేపు అలాగే ఉంచాలి. కొంత సమయం తరువాత కాటన్ బాల్ ను ఈ పాలలో ముంచి పాలను ముఖానికి పట్టించి కొద్దిసేపు అలాగే వదిలేయాలి. సుమారు 15 నిమిషాల తరువాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. పచ్చిపాలు, కుంకుమ పువ్వు రెండూ చర్మానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా మార్చడమే కాకుండా చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.

మెచ్యురిటీ ఉన్న అబ్బాయిలలో ఈ లక్షణాలు ఉంటాయి..!


సున్నితమైన చర్మం, పొడి చర్మం ఉన్నవారి చర్మం మృదువుగా మారాలి అంటే పచ్చిపాలు, తేనె చక్కని ఎంపిక. ఈ రెండింటిని కలిపి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తరువాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మం మృదువుగా మారుతుంది. ఇందులోనే కాసింత పసుపు కలిపి ముఖానికి అప్లై చేస్తే ముఖం మీద మచ్చలు చాలా తొందరగా మాయం అవుతాయి. పిగ్మెంటేషన్ కూడా తొలగిపోతుంది.

మార్కెట్లో దొరికే A1, A2 నెయ్యి మధ్య తేడాలేంటి?

అరోమా థెరపీ గురించి విన్నారా? దీంతో లాభాలేంటంటే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 25 , 2024 | 09:33 AM