Share News

Viral Video: ప్లాట్‌ఫామ్ పైకి దూసుకొచ్చిన రైలు.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు!

ABN , Publish Date - Aug 06 , 2024 | 08:31 PM

మన దేశంలో ఎంతో మంది రైళ్ల ద్వారా ప్రయాణం చేస్తుంటారు. సుదూర ప్రాంతాలకే కాదు.. మహా నగరాల్లో ఒక చోట నుంచి మరొక చోటుకు వెళ్లేందుకు కూడా లోకల్ రైళ్లనే ఆశ్రయిస్తుంటారు. రైలు ప్రయాణాన్ని చాలా వరకు సురక్షితంగా భావిస్తారు. అయితే ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాలు భారీగా పెరుగుతున్నాయి.

Viral Video: ప్లాట్‌ఫామ్ పైకి దూసుకొచ్చిన రైలు.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు!
Train Accident

మన దేశంలో ఎంతో మంది రైళ్ల (Trains) ద్వారా ప్రయాణం చేస్తుంటారు. సుదూర ప్రాంతాలకే కాదు.. మహా నగరాల్లో ఒక చోట నుంచి మరొక చోటుకు వెళ్లేందుకు కూడా లోకల్ రైళ్లనే (Local Train) ఆశ్రయిస్తుంటారు. రైలు ప్రయాణాన్ని చాలా వరకు సురక్షితంగా భావిస్తారు. అయితే ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ రైలు ట్రాక్ వదిలి ప్లాట్‌ఫామ్‌ (Railway Paltform) పైకి దూసుకొచ్చింది. ఎవరికీ గాయాలు కానప్పటికీ, ప్రమాదం జరిగిన తీరు మాత్రం షాకింగ్‌గా ఉంది (Viral Video).


mahipalyadav అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ రైల్వే ప్లాట్‌ఫామ్‌పై నడుస్తోంది. అదే సమయంలో ఓ లోకల్ ట్రైన్ వేగంగా వస్తోంది. ప్లాట్‌ఫామ్ దగ్గరకు రాగానే రైలు ముందు భాగంలో ఉన్న భోగీలు పట్టాలు తప్పి ప్లాట్‌ఫామ్‌ పైకి వచ్చి పైకి తేలిపోయాయి. దీంతో స్టేషన్‌లో గందరగోళం నెలకొంది. రైలు నుంచి దిగిన ప్రయాణికులు పరుగులు పెట్టారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. ముంబై (Mumbai)లోని చర్చిగేట్ సమీపంలో 2015లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Train Accident Video).


ఈ వైరల్ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. 4.4 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``లోకో పైలట్ దృష్టి ప్లాట్‌ఫారమ్‌పై నడుస్తున్న మహిళ వైపు ఉన్నట్టు ఉంది``, ``ప్లాట్‌ఫారమ్‌ పైకి రైలు రావడం అంటే ఇదేనేమో``, ``రైలు విన్యాసాలు అద్భుతం``, ``పాసింజర్లను భయపెట్టడానికి రైలు ఉపయోగించిన ట్రిక్ ఇది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఆ యువతి ధైర్యానికి హ్యాట్సాఫ్.. ఆమె వెంటనే స్పందించకపోతే పెద్ద ప్రమాదమే.. షాకింగ్ వీడియో వైరల్!


Viral Video: పెళ్లిలో పురోహితుడి చేయి పట్టుకున్న వధువు.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!


Viral: కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన వ్యక్తి.. అతడు చెప్పింది విని వెంటనే ఆపరేషన్ చేసి షాకైన డాక్టర్లు!


Optical Illusion: మీ కళ్లకు నిజమైన పరీక్ష.. ఈ ఫొటోలోని క్యారెట్ల మధ్య ఉన్న పెన్సిల్‌ను 10 సెకెన్లలో పట్టుకోండి!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 06 , 2024 | 08:31 PM