Oldest Bread: ప్రపంచంలో పురాతన బ్రెడ్ గుర్తింపు..ఎలా ఉందంటే
ABN , Publish Date - Mar 11 , 2024 | 10:34 AM
ప్రపంచంలో అత్యంత పాతదైన బ్రెడ్(Bread) గురించి మీకు తెలుసా? లేదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. టర్కీలో 8,600 సంవత్సరాల క్రితం నాటి పురాతనమైన రొట్టెను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే దాని విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రపంచంలో అత్యంత పాతదైన బ్రెడ్(oldest bread) గురించి మీకు తెలుసా? లేదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఇటివల టర్కీ(turkey) కొన్యా ప్రావిన్స్‌లోని కాటల్‌హోయుక్‌లో అత్యంత పురాతనమైన రొట్టె(bread)ను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ రొట్టె 8,600 సంవత్సరాల పురాతనమైనదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆ రొట్టె అవశేషాలు 'మెకాన్ 66' అనే ప్రాంతంలో పాక్షికంగా ధ్వంసమైన సమీపంలో కనుగొనబడ్డాయి. దాని చుట్టూ పురాతన మట్టి ఇటుక ఇళ్లు ఉన్నాయి.
అనాడోలు విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్, పురావస్తు శాస్త్రవేత్త(Archaeologists) అలీ ఉముట్ తుర్కాన్ ఈ మేరకు వివరాలను వెల్లడించారు. బ్రెడ్ చాలా గుండ్రంగా, మెత్తగా కాల్చకుండా పులియబెట్టినట్లు ఉందని ఆయన అన్నారు.
దానిని మధ్యలో వేలితో నొక్కితే లోపల ఉన్న పిండి పదార్థాలు నేటికీ సజీవంగా ఉన్నాయని చెప్పారు. స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ నుంచి పొందిన చిత్రాల ప్రకారం బ్రెడ్ లోపల స్టార్చ్ కణాలు కనిపించాయని చెప్పారు. అయితే పిండి, నీరును కలిపి ఆ కాలంలోనే తయారు చేయడం విశేషమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది తెలిసిన పలువురు ఆ కాలంలోనే రొట్టె(bread) తయారు చేసుకోవడం గ్రేట్ అని అంటున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Plane Crash: కుప్ప కూలిన విమానం..బాలుడితో సహా ఐదుగురు మృతి