Share News

Ratan Tata: రతన్ టాటా నిర్మించిన ఒకే ఒక సినిమా.. కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్!

ABN , Publish Date - Oct 10 , 2024 | 08:05 AM

భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటా సినీరంగంలోనూ కాలుపెట్టారు. అమితాబ్ బచ్చన్ నటించిన ఏత్‌బార్ అనే సినిమాకు ఆయన సహనిర్మాతగా వ్యవహరించారు.

Ratan Tata: రతన్ టాటా నిర్మించిన ఒకే ఒక సినిమా.. కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్!

ఇంటర్నెట్ డెస్క్: భారతీయ వ్యాపార దిగ్గజం రతన్ టాటా (86) కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. భారతీయ వ్యాపార విలువలకు ప్రతిబింబంగా నిలిచిన రతన్ టాటా దాతగా కూడా ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారు. అయితే, రతన్ టాటాకు సినీరంగంతో కూడా సంబంధం ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. బిగ్ బీ అమితాబ్ నటించిన ఓ హిందీ సినిమాకు ఆయన సహ ప్రొడ్యోసర్‌గా వ్యవహరించారు.

Ratan Tata: వ్యాపారాల్లో సూపర్ మ్యాన్.. లవ్‌లో ఫెయిల్..

2004లో విడుదలైన ఏత్‌బార్ అనే సినిమాకు ఆయన జతిన్ కుమార్‌తో కలిసి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీలో అమితాబ్‌తో పాటు ఆయన కూతురిగా బిపాశా బశు, ఆమె ప్రియుడిగా జాన్ అబ్రహాం నటించారు. ప్రేమ, వ్యామోహం, కుటుంబ సంబంధాలు కథాంశంగా ఈ చిత్రం తెరకెక్కింది.


విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో డా. రణ్‌వీర్ మల్హోత్రా పాత్రలో అమితాబ్ నటించారు. ఆయన కూతురు రియా పాత్రలో బిపాశా, ఆమె ప్రేమికుడు ఆర్యన్ త్రివేదీ పాత్రలో జాన్ అబ్రహాం నటించారు. ఆర్యన్ పూర్వాపరాలు తెలుసుకోకుండా తన కూతురు అతడి ప్రేమలో పడటం డా. మల్హోత్రాకు అస్సలు నచ్చడు. అతడి జీవితంలోని చీకటి కోణం మల్హోత్రాను ఆందోళనకు గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో కుటుంబంలో తలెత్తిన ఘర్షణ, తండ్రి ఆందోళన, ఆర్యన్ తీరు మధ్య సస్పెన్సన్ థ్రిల్లర్‌‌గా సాగిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్నే మూటకట్టుకుంది. దిగ్గజ నటీనటులతో, రూ.7.96 కోట్ల బడ్జెట్‌తో తీసిని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.9.50 కోట్లు మాత్రమే రాబట్ట కలిగింది. అయితే, రతన్ టాటా సహ నిర్మాతగా వ్యవహరించిన ఒకేఒక సినిమాగా నిలిచింది.

Chiranjeevi: టాటా అసాధారణ మనిషి.. భారతీయులందరికీ ఇది బాధాకరమైన రోజు


రతన్‌టాటా ఇకలేరన్న విషయం తెలిసి భారతీయులు అనేక మంది విచారంలో కూరుకుపోయారు. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు దిగ్గజ వ్యాపారవేత్తకు నివాళులు అర్పిస్తున్నారు. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేశారు. భారమైన హృదయంతో రతన్‌టాటాకు వీడ్కోలు పలుకుతున్నామని అన్నారు. టాటా సంస్థల ఎదుగుదలలో ఆయనది కీలక పాత్ర అన్నారు. మాతృదేశానికి ఎంతో చేసిన ఇంతటి అసామాన్య నాయకుడు మరొకరు లేరని వ్యాఖ్యానించారు. రతన్ టాటా తనకు మార్గదర్శి అని, స్నేహితులని పేర్కొన్నారు. రాబోయే తరాలకు ఆయన స్ఫూర్తి అని చెప్పారు.

Read Latest and National News

Updated Date - Oct 10 , 2024 | 08:19 AM