Share News

Viral: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. ఏటీఎమ్ సెంటర్‌లో కుట్టు మెషిన్.. సెక్యూరిటీ గార్డు నిర్వాకం చూశారా..!

ABN , Publish Date - Jul 22 , 2024 | 04:21 PM

ఒక సెక్యూరిటీ గార్డు ఏటీఎమ్ సెంటర్‌ను తన ప్రయోజనాలకు అనుగుణంగా మార్చేసుకున్నాడు. తను కాపలా ఉండాల్సిన ఏటీఎమ్ సెంటర్‌లో బట్టలు కుట్టే మెషిన్ ఏర్పాటు చేసుకుని బట్టలు కుడుతున్నాడు. అతడి నిర్వాకాన్ని చూసిన వాళ్లు ముక్కు మీద వేలేసుకుంటున్నారు.

Viral: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. ఏటీఎమ్ సెంటర్‌లో కుట్టు మెషిన్.. సెక్యూరిటీ గార్డు నిర్వాకం చూశారా..!
Stitching in ATM Center

ఒక సెక్యూరిటీ గార్డు (Security gaurd) ఏటీఎమ్ సెంటర్‌ (ATM Center)ను తన ప్రయోజనాలకు అనుగుణంగా మార్చేసుకున్నాడు. తను కాపలా ఉండాల్సిన ఏటీఎమ్ సెంటర్‌లో బట్టలు కుట్టే మెషిన్ (Stitching machine) ఏర్పాటు చేసుకుని బట్టలు కుడుతున్నాడు. అతడి నిర్వాకాన్ని చూసిన వాళ్లు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. అతడి గురించి నెట్టింట్లో జోరుగా చర్చ జరుగుతోంది. naughtyboii65 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ ఫొటో షేర్ అయింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral News).


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఓ ఏటీఎమ్ సెంటర్ కనబడుతోంది. అందులో సెక్యూరిటీ గార్డు డ్రెస్‌లో ఉన్న ఓ వ్యక్తి బట్టల మెషిన్ ఏర్పాటు చేసుకుని బట్టలు కుట్టుకుంటున్నాడు. ఏటీఎమ్ రూమ్‌లో చక్కగా లైట్, ఏసీ ఆన్ చేసుకుని తన పని చేసుకుంటున్నాడు. అటు ఓ వైపు సెక్యూరిటీ గార్డుగా, మరోవైపు దర్జీగా రెండు పనులూ చేసేస్తున్నాడు. ఓ వ్యక్తి ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ ఫొటోపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు (Stitching in ATM Center).


ఈ వైరల్ ఫొటోను ఇప్పటివరకు మిలియన్ మందికి పైగా వీక్షించారు. 1.4 లక్షల కంటే ఎక్కువ మంది ఈ ఫొటోను లైక్ చేశారు. ఈ ఫొటోపై తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. ``చిరిగిపోయిన నోట్లను కూడా కుడతాడేమో``, ``పార్ట్ టైమ్ జాబ్ బాగుంది``, ``ఏటీఎంలో ఉన్నా పని ఆగకూడదు``, ``డబుల్ డ్యూటీ``, ``ఆటోమేటిక్ టైలర్ మెషిన్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ కుర్రాడు మట్టిలో మాణిక్యం.. నోటితో 50 కేజీల సిమెంట్ బస్తా ఎలా మోస్తున్నాడో చూడండి..


Elon Musk: ప్రపంచ అగ్రనేతల ర్యాంప్ వాక్.. ఎలన్ మస్క్ ఏఐ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 22 , 2024 | 04:21 PM