Viral: అడవి ఏనుగుతో సెల్ఫీ.. ఆగ్రహించిన గజరాజు.. చివరకు ఆ యువకుడి పరిస్థితి ఏమైందంటే..
ABN , Publish Date - Oct 26 , 2024 | 10:50 AM
చాలా మంది సమయం, సందర్భం లేకుండా, ఎవరితో సెల్ఫీ దిగుతున్నామనే స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నారు. క్రూర మృగాలతో కూడా సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రమాదాలు కూడా ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కరూ సెల్పీ (Selfie) పట్ల మోజు పెంచుకుంటున్నారు. సమయం, సందర్భం లేకుండా, ఎవరితో సెల్ఫీ దిగుతున్నామనే స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నారు. క్రూర మృగాలతో కూడా సెల్ఫీల (Selfie with Wild Animals) కోసం ఎగబడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రమాదాలు కూడా ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ కుర్రాడు అడవి ఏనుగుతో (Wild Elephant) సెల్పీ దిగేందుకు ప్రయత్నించి ఏకంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మహారాష్ట్రలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది (Selfie with Elephant).
ఈ ఘటన మహారాష్ట్ర (Maharashtra)లోని గడ్చిరోలిలోని అబాపూర్ అడవుల్లో గురువారం ఉదయం చోటు జరిగింది. శ్రీకాంత్ రామచంద్ర (23) అనే యువకుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి గడ్చిరోలి జిల్లాలో కేబుల్ లేయింగ్ పని కోసం వెళ్లాడు. సమీప అటవీ ప్రాంతమైన అబాపూర్లో ఏనుగులు ఉన్నట్టు తెలుసుకున్నారు. పని పూర్తయిన తర్వాత ముగ్గురూ కలిసి అడవిలోకి వెళ్లారు. అక్కడ వారు తిరుగుతుండగా ఓ అడవి ఏనుగు కనిపించింది. ఆ ఏనుగు దగ్గరకు వెళ్లి శ్రీకాంత్ ఫొటో తీసుకోవడానికి ప్రయత్నించాడు. వారి చేష్టలతో ఆ ఏనుగు తీవ్ర ఆగ్రహానికి గురైంది.
ముగ్గురిని చాలా దూరం వెంటాడింది. ఆ ముగ్గురిలో ఇద్దరు ఎలాగోలా తప్పించుకున్నారు. శ్రీకాంత్ మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆ ఏనుగుకు దొరికిపోయాడు. శ్రీకాంత్‌ను పట్టుకున్న ఏనుగు అతడిని ఏనుగు తొండంతో కొడుతూ.. కిందపడేసి కాలితో తొక్కేసింది. ఈ ఘటనలో శ్రీకాంత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మిగతా ఇద్దరూ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసుకుని విచారణ ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: సూపర్ ఫైట్ అంటే ఇదీ.. ఇద్దరు మహిళలు బిందెలతో ఎలా కొట్టుకున్నారో చూడండి.. వీడియో వైరల్..
Viral Video: ఓర్నీ.. ఇంతకు తెగిస్తారా? ప్రజల కళ్ల ముందే కిడ్నాప్.. చివరకు బయట పడిన షాక్ ఏంటంటే..
Picture Puzzle: మీవి డేగ కళ్లు అయితే.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 15 సెకెన్లలో కనుక్కోండి...
మరిన్ని ప్రత్యేక వార్తలు కోెసం క్లిక్ చేయండి..