Share News

Viral Video: వామ్మో.. కుక్కను మింగేసి కదల్లేకపోతున్న భారీ కొండ చిలువ.. షాకింగ్ వీడియో వైరల్..

ABN , Publish Date - Dec 06 , 2024 | 03:22 PM

వరదల సమయంలో సాధారణ ప్రాణులే కాదు.. ఎంతో బలమైన, భారీ జంతువులు కూడా ఇబ్బందులకు గురవుతాయి. ఇటీవల థాయ్‌లాండ్‌ను భారీ వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. మానవులనే కాకుండా భారీ జంతువులను కూడా ఆ వరదలు నిస్సహాయంగా మార్చేశాయి.

Viral Video: వామ్మో.. కుక్కను మింగేసి కదల్లేకపోతున్న భారీ  కొండ చిలువ.. షాకింగ్ వీడియో వైరల్..
Huge python in Flood water

మన అవసరాలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడే నీరు (Water) ఎంతో విధ్వంసాన్ని కూడా సృష్టించగలదు. నీటి శక్తి గురించి తెలుసుకోవాలంటే భారీ వర్షాలు, వరదలు (Floods) సృష్టించే విలయాన్ని చూడాలి. వరదల సమయంలో సాధారణ ప్రాణులే కాదు.. ఎంతో బలమైన, భారీ జంతువులు కూడా ఇబ్బందులకు గురవుతాయి. ఇటీవల థాయ్‌లాండ్‌ను భారీ వరదలు (Thailand Floods) ముంచెత్తిన సంగతి తెలిసిందే. మానవులనే కాకుండా భారీ జంతువులను కూడా ఆ వరదలు నిస్సహాయంగా మార్చేశాయి. ఒక పెద్ద కొండచిలువ (Python) బలమైన ప్రవాహంలో చిక్కుకున్నట్లు కనిపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


@AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. థాయ్‌లాండ్‌ను వరదలు ముంచెత్తిన సమయంలో ఓ భారీ కొండచిలువ నగరంలోకి కొట్టుకుని వచ్చింది. ఆ భారీ కొండచిలువ నీటి ప్రవాహం నుంచి తనను తాను రక్షించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అయితే ఆ నీటి ప్రవాహం ముందు దాని బలం సరిపోలేదు. ఆ కొండ చిలువ శరీరం మధ్యలో ఉబ్బెత్తుగా కనిపిస్తోంది. అప్పుడే అది ఓ వీధి కుక్కను మింగేసింది. వరదకు తోడు, అప్పుడే కుక్కను మింగడంతో ఆ కొండచిలువ ముందుకు కదల్లేకపోతోంది. ఆ కొండచిలువ అవస్థను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


భారీ వర్షాల కారణంగా వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. కాగా, కొండచిలువకు సంబంధించిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు కోటి మందికి పైగా వీక్షించారు. 28 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ``ప్రకృతి ఉగ్రరూపం ముందు ఎంత శక్తిమంతమైన ప్రాణులైనా నిస్సహాయంగా మారిపోతాయనడానికి ఈ వీడియోనే ఉదాహరణ`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: యమధర్మరాజు లీవ్‌లో ఉన్నాడా.. ఈ కుర్రాడి ప్రమాదకర స్టంట్‌పై నెటిజన్ల రియాక్షన్స్ వింటే..


Viral News: అద్దెకు బాయ్‌ఫ్రెండ్స్, గర్ల్‌ఫ్రెండ్స్.. వియత్నాంలో ఈ కొత్త ట్రెండ్‌కు కారణం ఏంటంటే..


Viral Video: ఈ కుక్కకు ఏమైంది.. పెళ్లి మండపంలో వధువుకు చుక్కలు చూపించిన పెట్ డాగ్..


Viral News: వావ్.. వంట మనిషి కోసం రెజ్యూమ్.. వెల్లువలా వస్తున్న జాబ్ ఆఫర్లు..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 06 , 2024 | 03:22 PM