Shocking Video: పాపం.. కారు బానెట్ మీద కూర్చున్నాడు.. కళ్లెదురుగా సింహం.. తర్వాతేం జరిగిందో చూడండి..
ABN , Publish Date - Mar 22 , 2024 | 07:10 PM
ఇటీవలి కాలంలో చాలా మంది జంగిల్ సఫారీ టూర్‌లకు వెళుతున్నారు. అక్కడకు తమకు ఎదురైన షాకింగ్ అనుభవాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి వైరల్ అవుతున్నాయి.
అటవీ పర్యటన (Forest Tour) చాలా థ్రిల్ కలిగిస్తుంది. చాలా ఉత్కంఠగా, ఉత్సాహంగా అనిపిస్తుంది. ఇటీవలి కాలంలో చాలా మంది జంగిల్ సఫారీ టూర్‌లకు వెళుతున్నారు. అక్కడకు తమకు ఎదురైన షాకింగ్ అనుభవాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి వైరల్ అవుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే. ఎదురుగా సింహం (Lion) వచ్చినపుడు ఏం చేయాలో ఓ వ్యక్తి ఆ వీడియో ద్వారా తెలియజేశాడు (Encounter with Lion).
@AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి సఫారీ టూర్‌కు వెళ్లాడు. కారు బానెట్ మీద కూర్చుని అడవి అందాలను కెమేరాలో బంధిస్తున్నాడు. అంతలో అతడి ముందుకు ఓ సింహం వచ్చింది. అతడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏ మాత్రం కదిలినా సింహం చేతిలో ప్రాణాలు కోల్పోవాల్సిందే. అందుకే ఆ వ్యక్తి ఎటూ కదలకుండా విగ్రహంలా ఉండిపోయాడు. దగ్గరకు వచ్చి అతడిని పరిశీలించిన సింహం ముందుకు వెళ్లిపోయింది.
Viral: బెంగళూరు ట్రాఫిక్ జామ్‌లో కలుసుకున్న సహోద్యోగులు.. రోడ్డు మీదే వారిద్దరూ ఏం చేశారంటే..
ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు కోటి మంది ఈ వీడియోను వీక్షించారు. 27 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ``సింహాన్ని అంత దగ్గరగా చూస్తే గుండెపోటు వస్తుంది``, ``బాబోయ్.. నేను ఇంత ప్రశాంతంగా ఉండలేను``, ``ఎక్స్‌పర్ట్స్ తప్ప ఇలా ఎవరూ ప్రాణాలు కాపాడుకోలేరు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.