Viral Video: నాగుపాము పకోడీ.. ఇండోనేసియాలో స్నేక్ స్నాక్స్‌కు భారీ డిమాండ్.. ఆ షాప్‌లో పాములతో ఏం చేస్తున్నారంటే..
ABN , Publish Date - Aug 30 , 2024 | 04:09 PM
నాగుపాము పేరు వింటే చాలు జనాలు భయంతో వణికిపోతారు. అది కనబడితే పరుగులు తీస్తారు. అయితే ఇండోనేసియా రాజధాని జకర్తాకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా జనాలను ఆశ్చర్యపరుస్తోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలోని ఓ వ్యక్తి పాములతో రకరకాల స్నాక్స్ తయారు చేస్తున్నాడు.
నాగుపాము (King Cobra) అత్యంత విషపూరితమైన సర్పం. దాని పేరు వింటే చాలు జనాలు భయంతో వణికిపోతారు. అది కనబడితే పరుగులు తీస్తారు. అయితే ఇండోనేసియా (Indonesia) రాజధాని జకర్తాకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా జనాలను ఆశ్చర్యపరుస్తోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలోని ఓ వ్యక్తి పాములతో రకరకాల స్నాక్స్ (Snake Snacks) తయారు చేస్తున్నాడు. ఆ ఫుడ్‌స్టాల్ దగ్గర నాగుపాము పకోడీలను (Cobra Pakora) తయారు చూస్తున్నాడు. ఆ వీడియో నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది (Viral Video).
Akash Chaudhary అనే కంటెంట్ క్రియేటర్ ఈ వీడియోను షేర్ చేశాడు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో, ఆకాష్ చౌదరి.. కోబ్రా పకోడీలను తినడానికి ప్రజలు ఎంత ఉత్సాహంతో అక్కడికి వస్తున్నారో చూపించాడు. అంతేకాదు ఆ ఫుడ్‌స్టాల్ దగ్గర జనాలు నాగుపాము రక్తాన్ని కూడా తాగుతున్నారట. అది తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా, చర్మానికి మంచి మెరుపు కూడా వస్తుందట. ఆ ఫుడ్‌స్టాల్ దగ్గర ఒక పెద్ద బోను ఉంది. ఆ బోనులో బతికి ఉన్న నాగుపాములు ఉన్నాయి. ఒక్కో నాగుపాము ధర రూ. 2 లక్షల ఇండోనేషియా రూపాయిలు అట. అంటే భారతీయ కరెన్సీలో వెయ్యి రూపాయలు. ఎవరైనా ఆర్డర్ చేసే ఆ బోనులో నుంచి పాములను తీసి స్నాక్స్ తయారు చేస్తున్నారు.
ఆ ఫుడ్‌స్టాల్ దగ్గర పాములతో పకోడీలు, బర్గర్‌లు, మోమోలు చేస్తారు. అలాగే పాములతో బార్బిక్యూ కూడా చేస్తారట. ఈ విచిత్రమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు కోటికి పైగా వ్యూస్ వచ్చాయి. 6.6 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``స్నేక్స్‌తో స్నాక్స్``, ``ఇకపై కోబ్రా వైరస్ వస్తుంది``, ``హర హర మహాదేవ్..`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఈ వరుడు ధోనీ కంటే స్పీడ్‌గా ఉన్నాడు.. మరదలికి మెరుపు వేగంతో షాకిచ్చాడు.. వీడియో వైరల్
Optical Illusion: డైనోసర్ల మధ్య ఉన్న బల్బును కనిపెట్టండి.. మీ పరిశీలనా శక్తి ఏపాటిదో తెలుసుకోండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి