Share News

Ultra marathon: మహిళ 1000 కిలోమీటర్ల పరుగు.. వేడికి కరిగిపోయిన బూట్లు!

ABN , Publish Date - Jun 16 , 2024 | 04:09 PM

అల్ట్రా మారథాన్ రన్నర్ నాటలీ డావ్ చరిత్ర సృష్టించారు. థాయ్‌లాండ్, బ్యాంకాక్, మలేషియా, సింగపూర్‌ దేశాల మీదుగా 12 రోజుల్లో ఏకంగా వెయ్యి కిలోమీటర్ల మారథాన్ పరుగు పూర్తి చేసిన అరుదైన ఘనత సాధించారు.

Ultra marathon: మహిళ 1000 కిలోమీటర్ల పరుగు.. వేడికి కరిగిపోయిన బూట్లు!

ఇంటర్నెట్ డెస్క్: అల్ట్రా మారథాన్ రన్నర్ నాటలీ డావ్ చరిత్ర సృష్టించారు. థాయ్‌లాండ్, మలేషియా, సింగపూర్‌ దేశాల మీదుగా 12 రోజుల్లో ఏకంగా వెయ్యి కిలోమీటర్ల మారథాన్ పరుగు పూర్తి చేసిన అరుదైన ఘనత సాధించారు. అతితక్కువ సమయంలో వెయ్యి కిలోమీటర్ల థాయ్‌లాండ్-సింగపూర్ అల్ట్రా మారథాన్ టైటిల్‌ను దక్కించుకున్నారు. పరుగుతో అత్యంతవేగంగా మేలేషియా ద్వీపాన్ని దాటిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డు కూడా త్వరలో ఆమె సొంతం కానుంది. కేవలం టైటిల్ కోసమే కాకుండా ఆమె ఈ మారథాన్ ద్వారా గ్లోబల్ ఛారిటీ అనే స్వచ్ఛంద సంస్థ కోసం 50 వేల డాలర్ల విరాళాలను కూడా సేకరించగలిగారు. ప్రస్తుతం ఈ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా (Viral) మారింది.

Viral: మనిషితో పందెం.. సింహం తల వంచి ఓటమి ఒప్పుకుందా? షాకింగ్ వీడియో


ఈ అసాధారణ ఫీట్ పూర్తి చేసేందుకు ఆమె ఎన్నో కష్టనష్టాలకు ఎదురీదారు. 35 డిగ్రీల ఉష్ణోగ్రత, తుంటెకు గాయాన్ని కూడా ఆమె లెక్కచేయలేదు. తొలి రోజు నుంచే తుంటె సమస్య వేధించినా ఆమె వెనక్కు తగ్గలేదు. తీవ్ర వేడి కారణంగా ఒకానొక సమయంలో ఆమె వేసుకున్న బూట్లు కూడా కరిగిపోయాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ కూడా ఆమెను వేధించింది. రోజుకు సగటున ఆమె 84 కిలోమీటర్ల మేర మేరథాన్ పరుగులో పాల్గొంది. ఈ అద్భుతం సాధించడంలో డావ్‌ టీం కూడా ఆమెకు వెన్నంటే నిలిచింది. కావాల్సిన మద్దతు ఇచ్చారు. ఈ పరుగు ద్వారా మరింత మందిని మారథాన్లవైపు మళ్లేలా స్ఫూర్తి నింపాలని ఆమె ఆకాంక్షించింది.

Read Viral and Telugu News

Updated Date - Jun 16 , 2024 | 04:15 PM