Share News

Sidhartha Mallya Wedding: విజయ్ మాల్యా కొడుకు సిద్ధార్థ వివాహం.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా?

ABN , Publish Date - Jun 18 , 2024 | 08:00 AM

పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ మాల్యా పెళ్లి (Sidhartha Mallya Wedding) పీటలు ఎక్కబోతున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్ జాస్మిన్‌ను వివాహమాడబోతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అతడే ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు. ‘పెళ్లి వారం మొదలైంది’ అంటూ తెలియజేశాడు.

Sidhartha Mallya Wedding: విజయ్ మాల్యా కొడుకు సిద్ధార్థ వివాహం.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా?

పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ మాల్యా పెళ్లి (Sidhartha Mallya Wedding) పీటలు ఎక్కబోతున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్ జాస్మిన్‌ను వివాహమాడబోతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అతడే ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు. ‘పెళ్లి వారం మొదలైంది’ అంటూ తెలియజేశాడు. ఈ కాబోయే భార్య ఫొటోను కూడా సిద్ధార్థ మాల్యా పంచుకున్నాడు. ఒకరినొకరు హత్తుకొని ఫ్లవర్ ఫ్రేమ్‌లో పోజులిచ్చిన ఫొటోను అతడు షేర్ చేశాడు.


కాగా సిద్ధార్థ మాల్యా 2023 హాలోవీన్ రోజున జాస్మిన్‌కు తన ప్రేమను వ్యక్తపరిచాడు. మాజీ మోడల్ అయిన జాస్మిన్ ఈ విషయాన్ని స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. ఇద్దరూ హాలోవీన్ కాస్ట్యూమ్‌లో ఫొటోలను షేర్ చేసి ఈ విషయాన్ని వెల్లడించింది. సిద్ధార్థ మాల్యా మోకాళ్లపై కూర్చొని తన ప్రేమను ప్రపోజ్ చేయడం ఈ ఫొటోల్లో కనిపించింది. ఆమె వేలుకి రింగ్ కూడా తొడిగాడు. వీరిద్దరూ కలిసి ఫొటోలకు పోజులు ఇచ్చారు.


సిద్ధార్థ మాల్యా ఏం చేస్తారు?

సిద్ధార్థ మాల్యా మాజీ నటుడు, మోడల్. మానసిక ఆరోగ్యంపై అతడు రెండు పుస్తకాలు రాశాడు. యువతలో మానసిక ఆరోగ్య అవగాహన కోసం సలహాలు, సూచనలు ఇస్తుంటారు. సిద్ధార్థ తన మానసిక ఆరోగ్య ప్రయాణాన్ని తెలియజేస్తూ ‘ఇఫ్ ఐ యామ్ హానెస్ట్: ఎ మెమోయిర్ ఆఫ్ మై మెంటల్ హెల్త్ జర్నీ’ పుస్తకం రాశాడు. ఇక చిన్న పిల్లల కోసం తన రెండవ పుస్తకం ‘సాడ్-గ్లాడ్’ను రచించాడు. కాగా సిద్ధార్థ మాల్యా ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు డైరెక్టర్‌గా వ్యవహరించినప్పుడు తొలిసారి వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత ‘ది హంట్ ఫర్ ది కింగ్‌ఫిషర్ క్యాలెండర్ గర్ల్ 2013’లో న్యాయనిర్ణేతగా మెరిశాడు. కాగా సిద్ధార్థ మాల్యా తండ్రి విజయ్ మాల్యా.. యూబీ గ్రూప్ మాజీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. ప్రధానంగా మద్యంతో పాటు ఇతర వ్యాపారాలను ఈ కంపెనీ నిర్వహించింది.


సిద్ధార్థ ఎక్కడ పెరిగాడు?

సిద్ధార్థ మాల్యా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్‌లో జన్మించాడు. లండన్, యూఏఈలో పెరిగాడు. వెల్లింగ్టన్ కాలేజీ, క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో చదువుకున్నాడు. ఆ తర్వాత రాయల్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ స్పీచ్ అండ్ డ్రామాలో విద్య అభ్యసించాడు. డ్రామా స్కూల్ నుంచి పట్టా పొందిన అనంతరం మోడల్‌గా, నటుడిగా పని చేయడం ఆరంభించాడు. సెక్స్ కామెడీ మూవీ ‘బ్రహ్మన్ నామన్’ సహా అనేక సినిమాలు, టెలివిజన్ షోలలో సిద్ధార్థ మాల్యా కనిపించాడు. ఒక ఆన్‌లైన్ వీడియో షోకు కూడా హోస్ట్‌గా వ్యవహరించాడు. గిన్నిస్‌కు మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేశాడు.

Updated Date - Jun 18 , 2024 | 08:00 AM