Share News

Singer Mounika: కళ్లు లేకున్నా సంగీత ప్రపంచాన్ని గెలిచింది.. మౌనిక నీకు మా సెల్యూట్

ABN , Publish Date - Nov 13 , 2024 | 12:06 PM

Singer Mounika: సంగీతం ఆమె ప్రాణం. పాట ఆమె జీవితం. ఆ మధురమైన గాత్రం వింటే ఎవ్వరైనా పరవశించిపోవాలంతే. అద్భుతమైన గొంతుతో అమృతం కురిపించే ఆ గాయని పేరే మౌనిక.

Singer Mounika: కళ్లు లేకున్నా సంగీత ప్రపంచాన్ని గెలిచింది.. మౌనిక నీకు మా సెల్యూట్

కళ్లు ఉండి కూడా చాలా మంది ఏం సాధించరు. సాదాసీదా జీవనం గడిపేస్తుంటారు. కానీ ఆమె అలా కాదు. ఒకవైపు సంగీతం, మరోవైపు క్రికెట్, ఇంకోవైపు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ విభిన్న రంగాల్లో దూసుకెళ్తోంది. చూపు లేకపోయినా మనోనేత్రంతో తాను అనుకున్న లక్ష్యాల వైపు చూస్తూ వడివడిగా పరుగులు పెడుతోంది. ఉన్నది ఒకటే జిందగీ, అందులో ఏమేం చేయాలో అన్నీ చేసేయాలి అంటోంది. అమ్మ కోరిక మేరకు మ్యూజిక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సంచలనాలు సృష్టిస్తున్న ఆ సింగర్ మరెవరో కాదు.. మౌనిక.


ఇండియన్ ఐడల్‌తో వెలుగులోకి..

మౌనిక అందరిలాంటి అమ్మాయి కాదు. చిన్నప్పటి నుంచి ఆమెను కంటిచూపు సమస్య వేధిస్తోంది. కళ్లతో చదివితే చూపు పూర్తిగా పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించడంతో మౌనికను బ్లైండ్ స్కూల్‌లో చేర్పించారు తల్లిదండ్రులు. ఒకవైపు చదువుతూనే సింగర్‌గా చూడాలనే అమ్మ కోరిక నెరవేర్చేందుకు మరోవైపు మ్యూజిక్ కూడా నేర్చుకుంది. ఇటీవల తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్‌లో అద్భుతమైన గాత్రంతో అందర్నీ మెప్పించింది మౌనిక. అమృతం కురిపించే ఆమె గొంతుకు ఎస్ఎస్ థమన్, నిత్యామీనన్ లాంటి సెలెబ్రిటీలు ఫిదా అయిపోయారు.


మల్టీటాలెంట్

మౌనిక నుంచి చూపు తీసుకెళ్లిన దేవుడు ఆమెకు అద్భుతమైన గొంతు ఇచ్చాడు. దాన్నే ఆయుధంగా వాడుకొని సంగీత ప్రపంచంలో దూసుకొచ్చిందామె. ఇండియన్ ఐడల్‌లో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో ఆమెకు సినిమాల్లో పాడే అవకాశాలు దక్కుతున్నాయి. దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర స్పూర్తిగా ఈ రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ప్రయత్నిస్తోంది. ఒకవైపు మ్యూజిక్ జర్నీ కొనసాగిస్తూనే.. మరోవైపు బ్లైండ్ క్రికెట్‌లో అద్భుతమైన ఆటతీరుతోనూ మ్యాజిక్ చేస్తోంది మౌనిక. అలాగే తండ్రి కోరిక మేరకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతోంది. ఈ మల్టీటాలెంటెడ్ సింగర్ గురించి తెలిసిన వారు ఆమెకు సెల్యూట్ చేస్తున్నారు. కళ్లు లేకపోయినా ఆమె మనోధైర్యంతో దూసుకెళ్తున్న తీరును మెచ్చుకుంటున్నారు. మౌనిక ఎంతో మందికి స్ఫూర్తి అని ప్రశంసిస్తున్నారు.


Also Read:

తీవ్ర కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. ఎక్స్ రే చూసి నివ్వెరపోయిన డాక్టర్..

కదులుతున్న గూడ్స్ రైలుపై ప్రమాదకర విన్యాసాలు.. స్నేహితులంతా చూస్తుండగానే.. చివరకు..

ఎంత మోసం.. మంచానపడ్డ భర్తకు సేవలు చేసి కోలుకునేలా చేస్తే..

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 13 , 2024 | 12:16 PM